సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 20, 2020 , 03:37:25

టీఆర్‌ఎస్‌తోనే మత సామరస్యం

టీఆర్‌ఎస్‌తోనే మత సామరస్యం
  • -ముస్లింల సంక్షేమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృషి
  • -పట్టణంలోని 30 మున్సిపల్‌ వార్డులను కైవసం చేసుకోవాలి
  • -హోంమంత్రి మహమూద్‌ అలీ
  • -కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించాలి
  • -రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి పిలుపు
  • -జనగామలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం
  • -పాల్గొన్న మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి


‘ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. టీఆర్‌ఎస్‌తోనే మతసామరస్యం సాధ్యమవుతుంది’ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లితో కలిసి జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ 60 ఏళ్లు తెలంగాణను నాశనం చేసిన పార్టీలు.. మళ్లీ పట్టణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండి ఆ పార్టీ అభ్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, టీడీపీలను చిత్తుచిత్తుగా ఓడించాలని మంత్రి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.     -జనగామ, నమస్తే తెలంగాణ

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 19 : స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్‌ఎస్‌ పాలనలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌తోనే మత సామరస్యం సాధ్యమైందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆదివారం జనగామలోని పూర్ణిమ గార్డెన్స్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఖాదీ బోర్డు చైర్మన్‌ మౌలానా యూసుఫ్‌ జాహేద్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ అరవై ఏళ్లు తెలంగాణను నాశనం చేసిన పార్టీలు మళ్లీ పట్టణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండి ఆ పార్టీ అభ్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.  టీఆర్‌ఎస్‌ మినహా ఇతర పార్టీలన్నీ తెలంగాణ ద్రోహులేనని, అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణను సర్వనాశనం చేశాయని కాంగ్రెస్‌, టీడీపీలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను సైతం అడ్డుకొని విషం చిమ్ముతున్నాయని, అయినా వాటిని చేధిస్తూ కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా నిలిపారన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది కేసీఆర్‌ కల అని మహమూద్‌ అలీ అన్నారు. తెలంగాణలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే భేదం లేకుండా అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్సేనని అన్నారు. మసీద్‌ల అభివృద్ధికి, సదర్‌లకు గౌరవ వేతనం ఇచ్చి ఇస్లామిక్‌ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య నిరంతరం అభివృద్ధి శ్రామికులుగా ప్రజల్లో ఉంటున్నారని కొనియాడారు. జనగామ అభివృద్ధి అద్భుతంగా జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి సత్తాచాటాలన్నారు.

చిత్తుగా ఓడించాలి : మంత్రి ఎర్రబెల్లి

జనగామ పట్టణం నాశనం కావడానికి కాంగ్రెస్‌ కారణమైతే.. ఏనాడో అభివృద్ధి జరగాల్సిన మున్సిపాలిటీని అట్టడుగుకు తొక్కిన పాపం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. కేంద్రంలో రెండుసార్లు అధికారంలో ఉండి కూడా ఒక్కపైసా ఇవ్వకుండా మొండి చేయి చూపిన బీజేపీని మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు రాకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామ ప్రాంతం కరువుతో ఎడారిగా ఉండేదని, సాగు, తాగునీటి సమస్యను తీర్చకుండా గత పాలకులు వదిలేస్తే రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి ఎగువ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కష్టపడి జనగామ పట్టణానికి రూ.100 కోట్ల నిధులు సాధిస్తే రూ.30 కోట్లతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, ఇంకా మిగిలిన రూ.70 కోట్లను ప్రతి వార్డుకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల చొప్పున కేటాయించి సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకునే వారికి రూ.5.50 లక్షల చొప్పున ప్రతి వార్డుకు 50 నుంచి 100 ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఏడాది క్రితమే ఎన్నికలు జరిగితే ఇప్పటికి జనగామ మరింత అభివృద్ధి సాధించేదని, కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి అడ్డుకున్న పార్టీ అవసరమా.. ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. తీవ్ర జ్వరంతో కూడా ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మీ ముందుకు వచ్చారని, చైర్మన్‌ సహా 30 వార్డులను క్లీన్‌స్వీప్‌ చేసి జనగామ మున్సిపల్‌ను కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్నిగెలిపించుకోండి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

సాధారణ, జెడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చేలా 30వార్డు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి జనగామ మున్సిపల్‌పై గులాబీజెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. గతంలో కంటే మెరుగ్గా పట్టణ అభివృద్ధి చేశామని, ఇకపై జరిగే ప్రగతి ప్రజల చేతుల్లో పెడుతున్నాని పేర్కొన్న ఎమ్మెల్యే గత పాలనలో పరిస్థితి గుర్తు చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పనులు చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అనంతరం ఖాదీ బోర్డు చైర్మన్‌ మౌలానా యూసుఫ్‌ జాహేద్‌ మాట్లాడుతూ కారు.. కేసీఆర్‌.. సర్కారు నినాదంతో ప్రతి ముస్లిం ఓటరు ఈనెల 22న ఉదయం 7 గంటల వరకే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి మొదటి ఓటును టీఆర్‌ఎస్‌కు వేసి ఒక్కొక్కరు 10 మందితో వేయించాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖాజా అరీఫ్‌, ఎండీ అన్వర్‌ షరీఫ్‌, ఎండీ ఎజాజ్‌, ఖలీల్‌, తన్వీర్‌, సలీం, మసియోద్దీన్‌, యూసఫ్‌, నయీం, గౌస్‌ ఉమర్‌, జహంగీర్‌, అజీం, లతీఫ్‌షరీఫ్‌, ఖలీల్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, ఎంపీపీ కళింగరాజు, జెడ్పీటీసీ దీపిక మహేందర్‌రెడ్డి, లింగయ్య పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

జనగామలో జరిగిన టీఆర్‌ఎస్‌ ముస్లింల ఆత్మీయ స మ్మేళనంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్య సమక్షంలో ఆదివారం పెద్దఎత్తున పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా వారికి మంత్రులు గులాబీకండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రామిని బ్రదర్స్‌ చైర్మన్‌ రామిని చిరంజీవులు, రామిని రమేశ్‌, రామిని వెంకటేశ్వర్లు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ తోట సత్యం, ఎండీ షకీల్‌, ఇస్మాయిల్‌, అన్వర్‌, అక్బర్‌ఖాన్‌, ప్రేమలత, ధనలక్ష్మి, మాశెట్టి సుధాకర్‌, మునీర్‌, మస్తాన్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.logo