ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Jan 19, 2020 , 01:53:22

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

 టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • -అన్ని వార్డులు కైవసం చేసుకుంటాం
  • -సంక్షేమ సర్కార్‌కు అండగా నిలవండి
  • -30వార్డులు గెలిపిస్తే కార్పొరేషన్‌ హోదా
  • -జనగామ పట్టణ రోడ్‌షో ప్రచార సభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు
  • -10, 11, 12, 13, 15, 16, 17వ వార్డుల్లో జెడ్పీచైర్మన్‌ సంపత్‌రెడ్డి, ‘మండల’తో కలిసి విస్తృత ప్రచారం

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 18 : తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుపుతూ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలోని 10, 11, 12, 13, 14, 15, 16, 17 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు షమీమ్‌ అన్వర్‌ షరీఫ్‌, పాక రమ, గుర్రం భూలక్ష్మి, పానుగంటి సువార్త, పేర్ని స్వరూప, ఎక్కలదేవి సింహాద్రి, ఉడుగుల కిష్టయ్య, ముద్దసాని సరళ శ్రీనివాస్‌రెడ్డి గెలుపు కోసం జెడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, తరిగొప్పుల జెడ్పీటీసీ ముద్దసాని పద్మజా వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన విస్తృతంగా పాదయాత్ర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బోడకుంటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ పాలనకు జేజేలు పలుకుతున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న జనగామ మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పించే అంశాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద పెడుతానని చెప్పారు. తద్వారా జనగామ పట్టణ అభివృద్ధి సకల హంగులతో సుందరీకరణ చేసే బాధ్యత టీఆర్‌ఎస్‌దేనన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణ సుందరీకరణ కోసం మంజూరు చేసిన రూ.30కోట్ల నిధుల్లో బస్టాండ్‌ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు, చౌరస్తా నుంచి సూర్యపేట రోడ్డు, సిద్దిపేట రోడ్డు, హైదరాబాద్‌, హన్మకొండ రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్‌ లైటింగ్‌ అభివృద్ధి పనులు, సీసీరోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే అన్నివర్గాల ప్రజలకు పెద్దపేట వేస్తుందని, విజ్ఞులైన పట్టణవాసులు 30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాటలు పడుతాయని బోడకుంటి అన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ 30వార్డు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి జనగామ మున్సిపల్‌పై గులాబీజెండా ఎగురవేయాలని కోరారు. పట్టణ అభివృద్ధిని, ప్రజల చేతుల్లో పెడుతున్నానని పేర్కొన్న ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి పాలనను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతి చూడండి త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని దీవిస్తే ప్రజ ల్లో తానూ ఒకడిగా ఉంటూ జిల్లా కేంద్రాన్ని ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, గౌస్‌పాషా, చంద్రారెడ్డి, పెద్ది రాజిరెడ్డి, నర్మెట జెడ్పీటీసీ శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.logo