మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 18, 2020 , 03:19:03

కారు.. టాప్‌గేరు..!

కారు.. టాప్‌గేరు..!
  • -ప్రచారంలో గులాబీ జోష్‌
  • -గడపగడపకూ వెళ్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • -ఓటర్లను కలుస్తూ.. సంక్షేమ పథకాలను వివరిస్తూ..
  • -ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు
  • -కదులుతున్న ప్రజలు.. గులాబీమయంగా వీధులు
  • -తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
  • -ప్రచారంలో జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘కారు’ హోరెత్తిస్తున్నది. గులాబీ శ్రేణులు దండులా కదిలి గడపడగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జనగామ పురపోరులో టీఆర్‌ఎస్‌ ప్రచార సరళి ఇతర పార్టీల కంటే దూకుడుగా సాగుతున్నట్లు కనిపిస్తున్నది. ఉదయం మొదలు.. రాత్రి వరకూ 30 వార్డుల్లోని వీధులన్నీ గులాబీమయంగా కనిపిస్తున్నాయి. ఏ గల్లీ చూసినా, ఏ ఇంటికి వెళ్లినా సీఎం కేసీఆర్‌పైనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ ఫలాలు పొందుతున్న వారు తమ మనుసులోని భావాలను పథకాల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే వార్డులన్నీ క్లీన్‌స్వీప్‌ దిశగా గులాబీ శ్రేణుల ప్రచారం సాగుతున్నట్లు పట్టణంలో చర్చించుకోవడం కనిపిస్తున్నది.

సమన్వయంతో ప్రచారం

పట్టణంలోని 9, 13, 17, 26వ వార్డుల్లో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ రమణారెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, గౌరవ అధ్యక్షుడు బజ్జూరి గోపయ్య, 3, 28వ వార్డుల్లో జెడ్పీటీసీ దీపిక మహేందర్‌రెడ్డి, లింగాలఘనపురం ఎంపీపీ జయశ్రీ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆయా వార్డుల్లోని దుకాణాదారులతో మాట్లాడారు. వీధుల్లోని పెద్దలను కలిశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని వారు భరోసా ఇచ్చారు. పరిచయస్తులను పేరుపేరున పలకరిస్తూ ముందుకెళ్లారు. 3వ వార్డు అభ్యర్థి పగిడిపాటి సుధ గెలుపు కోసం నిర్వహించిన ప్రచారంలో జెడ్పీటీసీ దీపిక మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హయాంలోనే జనగామలో ఎనలేని అభివృద్ధి జరుగుతుందని గుర్తుచేశారు. గత పాలకుల నిర్లక్ష్యం ఇప్పుడు జరిగిన అభివృద్ధిని చూస్తే అర్థమవుతుందన్నారు. ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించారని గుర్తుచేశారు. వార్డుల్లోని వీధులన్నీ కలియతిరిగిన ఎమ్మెల్యేగా పేరు సంపాదించాని, ప్రజలకు అందుబాటులో ఉండే సుధను గెలిపించుకుని వార్డును మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజలకు సుపరిచిరుతురాలైన సుధ సౌమ్యత్వం అందరికి తెలిసిన విషయమే అన్నారు. కార్యక్రమంలో 3వ వార్డు అభ్యర్థి పగిడిపాటి సుధ, లింగాలఘనపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, పగిడిపాటి అర్జున్‌ కత్తుల లక్ష్మి, అంబటి రాజయ్య ఎండీ అబ్బాస్‌, అంజాజీ, బండి బీరయ్య, పద్మారెడ్డి, బుచ్చయ్య, రాము, లావణ్య, సాయిచరణ్‌, కుర్బాన్‌ పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి ‘సంక్షేమం’

దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే దక్కుతుందని జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి కనీసం ఒక్క పథకమైనా చేరాలనే ఆకాంక్షతో ప్రభుత్వం వినూత్నంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించిన కార్యదీక్షుడు కేసీఆర్‌ అని కొనియాడారు. జనగామలో అర్హులైన వారందరికీ పథకాలు అందేలా కృతనిశ్చయంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారన్నారు. గుజ్జ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ రూ. 36 కోట్లతో జనగామను తక్కువ కాలంలో సుందరీకరిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ లైటింగ్‌, అండర్‌ డ్రైనేజీ, బతుకమ్మకుంట అభివృద్ధి, ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ వంటి ఎన్నో పనులు కార్యరూపం దాల్చాయని అన్నారు. గోదావరి జలాలతో చెరువులకు జలకళ సంతరించుకుందన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య మాట్లాడుతూ వ్యాపారులకు పూర్తి సహకారాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం టీఐపాస్‌ను ప్రారంభించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి జూకంటి భాస్కర్‌రావు, 13వ వార్డు అభ్యర్థి పానుగంటి సువార్త, 17వ వార్డు అభ్యర్థి ముద్దసాని సరళ, 26వ వార్డు అభ్యర్థి పోకల జమున పాల్గొన్నారు. 8వ వార్డు అభ్యర్థి తాళ్ల సురేశ్‌రెడ్డి గెలుపు కోసం ఎంపీపీ మేకల కళింగరాజు జోరుగా ప్రచారం చేశారు.  29వ వార్డులో పంతులు ప్రభాకర్‌ విజయం కోసం రామేశ్వరి, కిశోర పుట్ట రామకృష్ణ తదితరులు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. 28వ వార్డు అభ్యర్థి మహ్మద్‌ సమద్‌ గెలుపు కోసం జెడ్పీటీసీ దీపిక మహేందర్‌రెడ్డి, సమద్‌ అనుచరులు ఇమ్రాన్‌, సత్య, శంకర్‌, సుమన్‌, ఫర్హాన్‌ కలిసి ప్రచారం నిర్వహించారు.

వాడవాడలా గులాబీ జెండా..

జనగామలోని 30 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గులాబీ జెండాలు చేతబూని కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ పనులకు వెళ్లకముందే నేతలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఇంటి యజమానులు ఇంట్లో ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థులు హంగు ఆర్బాటాలు లేకుండా గడపగడపకూ వెళ్లి కారుగుర్తుకు ఓటేమయని అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. మరుసటి రోజు కార్యక్రమాల్ని ముందు రోజు ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా సాగుతున్నారు.logo
>>>>>>