శనివారం 28 మార్చి 2020
Jangaon - Jan 18, 2020 , 03:18:21

రేపు పల్స్‌ పోలియో

రేపు పల్స్‌ పోలియోజనగామ టౌన్‌ : అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికి తప్పనిసరిగా పల్స్‌ పోలీయో చుక్కలను వేయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఏ మహేందర్‌ ప్రజలకు సూచించారు.శుక్రవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పల్స్‌ పోలీయోపై ఏర్పాటు చేసిన వైద్యాధికారి పల్స్‌ పోలీయో బ్యానర్స్‌, వాల్‌ పొస్టర్స్‌ను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్‌ పోలియో ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తంగా 42442 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందని, వీరందరికి పోలీయో చుక్కలను వేసేందకు 308 బృందాల్లో మొత్తంగా 1232 మంది ఉద్యోగులు పోలీయో చుక్కల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.విటిలో 94 హైరిస్క్‌ ప్రాంతాలు (ఇటుక బట్టిలు, స్లమ్స్‌, వ్యవసాయి క్షేత్రాల్లో ఉండే చిన్నపిల్లలకు సైతం పోలీయో చుక్కలు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.కావున మిరందరు ఈనెల 19వ తేదినజరిగు పల్స్‌ పోలీయో చుక్కల కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల మిపిల్లలకు చుక్కలు వేయించి పోలీయో వ్యాధి నివారణకు సహకరిం చగలరని కోరారు.ఈకార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్‌ అధికారి డాక్టర్‌ రాము, ప్రోగ్రం, మెడికల్‌ ఆఫిసర్‌ డాక్టర్‌ పుర్ణచందర్‌, మాస్‌ మిడియా ప్రతినిథి ప్రభాకర్‌, జిల్లా వైద్యాధికారి కార్యాల సిబ్బంది ఉత్తమ్‌, రాజశేఖర్‌, జయపాల్‌రెడ్డి, రవీందర్‌, రవి, రహమాన్‌, సంపత్‌ ఉన్నారు.


logo