శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jangaon - Jan 15, 2020 , 02:18:31

30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం


జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 14 : జనగామ పట్టణ ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో 30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను మంచి మెజార్టీ ఓట్లతో గెలిపించబోతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు కేటాయించిన తర్వాత మిగిలిన ఆశావహులకు స్వయంగా ఎమ్మెల్యే ఫోన్‌ చేసి మాట్లాడి పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేట్‌ పోస్టుల్లో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించడంతో పార్టీ పేరిట నామినేషన్లు వేసిన వారంతా ఉపసంహరించుకున్నారు. ఒకరిద్దరు మాత్రం ఆఖరి నిమిషయంలో కార్యాలయానికి వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమతించలేదు. కాగా, అభ్యర్థులకు బీ-ఫారాలు, మున్సిపల్‌ ఎన్నికలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలు 30 వార్డుల్లో గులాబీ పార్టీ అభ్యర్ధులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే జనగామ పట్టణ అభివృద్ధి.. సకల హంగులతో సుందరీకరణ చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతిలో పెడుతానన్నారు. మునుపడి కాంగ్రెస్‌ దుష్టపాలనకు ఇప్పటి టీఆర్‌ఎస్‌ సర్కారు హాయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పట్టణంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణ సుందరీకరణ కోసం మంజూరు చేసిన రూ.30కోట్ల నిధుల్లోంచి ఇప్పటికే బస్టాండ్‌ చౌరస్తా నుంచి నెహ్రుపార్కు, చౌరస్తా నుంచి సూర్యపేట రోడ్డు, సిద్ధిపేట రోడ్డు, హైదరాబాద్‌, హన్మకొండ రోడ్డు విస్తరణ,డ్రైనేజీ, సెంట్రల్‌ లైటింగ్‌ అభివృద్ధి పనులు, సీసీరోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సాధారణ, జెడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చేలా 30వార్డు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను గెలిపించి జనగామ మున్సిపల్‌పై గులాబీజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే మెరుగ్గా పట్టణ అభివృద్ధి చేశామని, ఇకపై జరిగే ప్రగతి ప్రజల చేతుల్లో పెడుతున్నాని పేర్కొన్న ఎమ్మెల్యే గత పాలనలో పరిస్థితి గుర్తు చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పనులు చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రగతి చూడండి త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని దీవిస్తే ప్రజల్లో ఒకడిగా ఉంటూ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలుపుతానని ఎమ్మెల్యే అన్నారు. జనగామకు ఇప్పటి వరకు చేసింది తక్కువే..ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని..సీఎం కేసీఆర్‌ మాటిచ్చిన ప్రకారం మెడికల్‌, నర్సింగ్‌, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలు సాధించుకోవాలని జనగామకు పడమర పక్క మరో బైపాస్‌ రోడ్డు నిర్మించుకుంటనే రింగ్‌రోడ్డు ఆకారం వస్తుందన్నారు. జనగామ పట్టణ అభివృద్ధి మీ చేతుల్లోనే పెడుతున్న మున్సిపాలిటీ గతంలో ఎలా ఉంది? కేసీఆర్‌ పాలనలో ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? రానున్న రోజుల్లో ఎలా ఉండాలన్నది చర్చించుకొని నిర్ణయించాల్సింది మీరేనని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.


logo