బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 15, 2020 , 02:11:14

పురపాలక అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి

పురపాలక అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి
  • -అభ్యర్థులకు బీ ఫామ్స్‌ అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, నమస్తే తెలంగాణ: పురపాలక అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అ భ్యర్థులను గెలిపించాలని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో గ ద్వాల పురపాలక చైర్మన్‌ అభ్యర్థి బీఎస్‌ కేశవ్‌తో కలిసి వార్డు కౌన్సిలర్లుగా బరి లో ఉన్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బీఫా మ్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కా రణంగా  పురపాలక సంఘం అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొన్నేళ్లుగా పురపాలక సంఘాన్ని ప్రతిపక్షాలు పాలించినా అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధిక నిధులు తీసుకవచ్చి గద్వాల పురపాలకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో సీసీ రోడ్డుతో పాటు బీటీ రోడ్లు, డ్రైనేజీల ని ర్మాణాలు చేపట్టామని వివరించారు. అ ధికార పార్టీ సభ్యులను ఆదరిస్తే పురపాలక సంఘం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రా నున్న పురపాలక ఎన్నికల్లో గద్వాల కో టపై గులాబీ జెండా ఎగురవేయడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను ఆదరిస్తే పురపాలక సంఘం అన్ని రంగాల్లో అభివృద్ది చెందడానికి అవకా శం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశా రు. కార్యక్రమంలో దౌలు, అని త, శ్రీనివాస్‌రెడ్డి, నరహరిగౌడ్‌, మహేశ్వరి, మురళి, నాగిరెడ్డి, బాబర్‌ పాల్గొన్నారు.

logo
>>>>>>