శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 14, 2020 , 03:51:07

ఛాగల్లు అంటే అభిమానం

ఛాగల్లు అంటే అభిమానం


స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తేతెలంగాణ, జనవరి 13: తాను గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఛాగల్లు అత్యధిక మెజార్టీ ఇచ్చిందని, అందుకే ఈ గ్రామం అంటే తనకు ఎంతో అభిమానమని, గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. చాగల్లులో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ వారి సౌజన్యంతో స్వాగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. ముఖ్య అతిథుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరితోపాటు డీసీపీ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఫైనల్‌ ఆడిన జనగామ స్టేడియం-గొట్టిపర్తి క్రీడాకారులను వారు  పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి విజేతలైన జనగామ జిల్లా స్టేడియం జట్టుకు మొదటి బహుమతి (రూ. 20,016), నల్లగొండ జిల్లా గొట్టిపర్తి జట్టుకు ద్వితీయ బహుమతి (రూ. 15,016), మహబూబాబాద్‌ జట్టుకు తృతీయ బహుమతి (రూ. 12,016), స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మండలం చాగల్లు స్వాగత్‌ యూత్‌-బీ జట్టుకు నాలుగో బహుమతి (రూ. 10,016), స్వాగత్‌ యూత్‌-ఏ జట్టుకు ఐదో బహుమతి (రూ. 8,016), స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మండలం పాంనూర్‌ జట్టుకు ఆరో బహుమతి (రూ. 6,016)ని అందజేశారు. అనంతరం సర్పంచ్‌ సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కడియం మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం పర్వతగిరిలో ఆరుసార్లు కబడ్డీ పోటీలు నిర్వహించామని, అందులో ఒకసారి చాగల్లు గెలిచిందని గుర్తుచేశారు. చాగల్లుకు కబడ్డీలో అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. జిల్లా క్రీడాకారుల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తున్న జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడలు సమైక్యతకు చిహ్నమన్నారు. క్రీడలతో సమాజంలో గుర్తింపు లభించడంతోపాటు  స్నేహబంధాలు పెరుగుతాయన్నారు. విద్యార్థులు, యువకులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. అనంతరం ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన జనగామ స్టేడియం కెప్టెన్‌ మొగళిగాని సందీప్‌ను అభినందించి, రూ. 10 వేల నగదు అందించారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓటమి గెలుపునకు నాంది అన్నారు. అనంతరం స్వాగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ అన్నం బ్రహ్మరెడ్డి, మాజీ ఎంపీపీ జగన్మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ స్వామినాయక్‌, ఎంపీటీసీ స్వరూప, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఇనుగాల నర్సింహారెడ్డి, మారజోడు రాంబాబు, రాఘవరెడ్డి, నాయకులు అన్నెపు ఐలయ్య, కనకం రమేశ్‌, గణేశ్‌, జిల్లా కబడ్డీ బాధ్యులు సారంగపాణి, టీ గట్టయ్య, ఎల్‌ సత్యనారాయణ, నీలం కుమార్‌, నరేందర్‌, వెంకటేశ్వర్లు, సుధాకర్‌, కుమార్‌, వీఆర్వో ప్రవీన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రవి, స్వాగత్‌ యూత్‌ అధ్యక్షుడు కూన రాజు, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, కార్యదర్శి అన్నెపు అనిల్‌, సభ్యులు శ్రీకాంత్‌, రమేశ్‌, రంగు యాకయ్య, సౌదరపల్లి సంపత్‌, మురళి, అజయ్‌, కిశోర్‌, వెంకటేశ్‌, పూర్ణచందర్‌, అరకాల సతీశ్‌, పోలీస్‌ సిబ్బంది కుమార్‌ పాల్గొన్నారు.logo