బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 14, 2020 , 03:50:02

ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు

ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు


జనగామ, నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ, జనవరి 13 : ఓటరు జాబితాలో తప్పులు ఉండకుండా రూ పొందించాలని రాష్ట్ర ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు అనితా రాజేంద్రన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లోని పెంబర్తి, రఘునాథపల్లి, ఛాగల్లు కేంద్రం, అలాగే చిన్నమడూరు గ్రామాల్లో ఆమె పర్యటించి పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆమె మాట్లాడుతూ బీఎల్వోలకు సూచనలు చేసి ఫారమ్‌-6ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఓటరు దరఖాస్తులను స్వీకరించి ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, డబుల్‌ ఓటర్లు, చనిపోయిన వారి పేర్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.బీఎల్వోలు వారి పరిధిలోని ఇంటింటికి తిరిగి ఓటరు జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. ఆమె వెంట జేసీ ఓజే మధు, డీఆర్‌వో మాలతి, డీఆర్‌డీవో రాంరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో రమేశ్‌, తహాశీల్దార్‌ విశ్వప్రసాద్‌, ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దార్‌ శంకర్‌, సర్పంచ్‌ సారంగపాణి, ఉపసర్పంచ్‌ రవి, వీఆర్‌వో ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.


logo
>>>>>>