గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 13, 2020 , 03:00:57

అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం


జఫర్‌ఘడ్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌, జనవరి 12 : గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని, ప్రజల భాగస్వామ్యం తోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని 21 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయా గ్రామాలతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంతోపాటు శివునిపల్లిలో పల్లెప్రగతి రెండో విడత ముగింపు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో దాతలు విరాళాలను అందించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదర్శ గ్రామంగా దేశ, విదేశాల్లో పేరుగాంచిన గంగదేవిపల్లిలా ప్రతి గ్రామం ఆదర్శంగా నిలిచేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని, మురికి నీరు నిల్వ లేకుండా చేసి పరిశుభ్రతను పాటించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రాంరెడ్డి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, జడ్‌పీటీసీ రవి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, సర్పంచ్‌ టి. సురేశ్‌కుమార్‌, ఆర్డీవో రమేశ్‌, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీఓ మహబూబ్‌అలీ, గ్రామయ ఈవో పున్నం శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, ఎం. రాజు, ఎస్‌ దయాకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌, పట్టణ అధ్యక్షులు తోట సత్యం, మునిగెల రాజు, యూత్‌ అధ్యక్షుడు మారెపల్లి ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు గుండె మల్లేశ్‌ తదితరులు పాల్గోన్నారు. జఫర్‌ఘడ్‌ ఎంపీపీ రడపాక సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కనుకయ్య, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్‌, మండలం లోని ఆయా గ్రామాల సర్పంచ్‌, ఎంపీటీసీ లు, జెడ్పీ సీఈవో రమాదేవి, పీడీ రాంరెడ్డి, తహసిల్ధార్‌ వీర ప్రకాశ్‌, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఆయా శాఖల అధికారులు, ఉపాధి సిబ్బంది, జీపీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.logo