సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 13, 2020 , 03:00:19

గ్రామాల అభివృద్ధికే ‘ప్రణాళిక’

గ్రామాల అభివృద్ధికే ‘ప్రణాళిక’


రఘునాథపల్లి : గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని బాంజీపేట, శ్రీమన్నారాయణపురం గ్రామాల్లో ఆదివారం జరిగిన పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్‌ గొరిగె భాగ్య-రవి అధ్యక్షత వహించగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.  అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ పరిసరాలను పరిశీలించి నాటిన మొక్కలకు స్వయంగా కలెక్టర్‌ నీరు పోశారు. శ్రీమన్నారాయణపురంలో నర్సరీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వసుమతి, తహసీల్దార్‌ బన్సీలాల్‌, సర్పంచ్‌ చింత సుశీల-స్వామి, ఎంపీటీసీ రచ్చ సోమనాథం, నాయకులు గొరిగె రవి, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.  


logo