శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 12, 2020 , 04:51:06

కబడ్డీలో చాగల్లు ఆణిముత్యం

కబడ్డీలో చాగల్లు ఆణిముత్యం
  • -జాతీయ స్థాయి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలి
  • -పోటీల్లో గెలుపోటములు సహజం
  • -స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి
  • -స్వాగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు


స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తే తెలంగాణ: కబడ్డీలో చాగల్లు ఆణిముత్యం లాంటిదని, గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న క్రీడకు జీవం పోస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న స్వాగత్‌ యూత్‌ కృషి అభినందనీయమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సౌజన్యంతో స్వాగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో చాగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శనివారం వారు ముఖ్య అతిథుగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ పోగుల సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. చాగల్లు కబడ్డీ క్రీడకు మారుపేరని, ఏటా ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్న స్వాగత్‌ యూత్‌ సభ్యులను ఈ సందర్భంగా వారు అభినందించారు. క్రీడా పోటీలను స్నేహభావంతో చూడాలని, గెలుపోటములు సహజమని వారు అన్నారు. దేశం తరఫున ఆడి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

క్రీడల అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ కృషి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి అన్నారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెంపొందడంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ప్రతి యువకుడు ఆటల్లో పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్లు వివరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి అక్కనపెల్లి బాలరాజు,  ఎంపీటీసీ కనకం స్వరూప, ఉప సర్పంచ్‌ పొన్నబోయిన రవి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు అన్నెపు కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇనుగాల నర్సింహారెడ్డి, అన్నెపు ఐలయ్య, కనకం రమేశ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సమ్మయ్య, టీఆర్‌ఎస్‌ చిలుపూర్‌ మండల అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, జిల్లా అసోసియేషన్‌ బాధ్యులు పోగుల సారంగపాణి, తోటకూరి గట్టయ్య, ఎల్‌ సత్యనారాయణ, నరేందర్‌, నీలం కుమార్‌, తోటకూరి వెంకటేశ్వర్లు, చింతకింది సుధాకర్‌, నూకల రాజు, స్వాగత్‌ యూత్‌ అధ్యక్షుడు కూన రాజు, ఉపాధ్యక్షుడు సొన్నాయిల సురేశ్‌, కార్యదర్శి అన్నెపు అనిల్‌, కూన రమేశ్‌, క్రీడా కార్యదర్శి వేళ్ల శ్రీకాంత్‌, సభ్యులు రంగు యాకయ్య, వడ్లకొండ కిశోర్‌, దోమల రమేశ్‌, కత్తెరశాల వెంకటేశ్‌, గూడూరు పూర్ణచందర్‌, తోట రమేశ్‌, గూడెల్లి రాజేశ్‌ పాల్గొన్నారు. కాగా, కబడ్డీ క్రీడాకారులకు చెప్పాల రాజు (జీవీఆర్‌ గ్రూప్‌ ఇన్ప్రా డెవలప్‌మెంట్‌ మార్కెటింగ్‌ ఎండీ) టీషర్టులను ఎమ్మెల్యే రాజయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.


logo