గురువారం 09 ఏప్రిల్ 2020
Jangaon - Jan 12, 2020 , 04:50:23

‘పల్లె ప్రగతి’తో గ్రామ స్వరాజ్యం

‘పల్లె ప్రగతి’తో గ్రామ స్వరాజ్యం


కొడకండ్ల, జనవరి 12: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలతో సాధ్యమవుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని రామవరం గ్రామంలో జరుగుతున్న రెండో విడత పల్లెప్రగతి పనులను శనివారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలంటే పల్లెలు బాగుపడాలని ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికతో పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణను రూపొంది, మొదటి విడతలో 30 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని గుర్తుచేశారు. ఇంకా మిగిలిపోయిన సమస్యలను గుర్తించి రెండో విడతలో 11 రోజులపాటు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో గ్రామస్తులు, సర్పంచ్‌లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు.


logo