బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 12, 2020 , 04:49:42

శ్మశాన వాటిక పనుల పరిశీలన

శ్మశాన వాటిక పనుల పరిశీలన


ఈ సందర్భంగా మంత్రి రామవరంలో శ్మశాన వాటిక పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలకు నీళ్లు పోశారు. డంపింగ్‌ యార్డు పనుల్లో మట్టిని తవ్వారు. అనంతరం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన నాటిన మొక్కలకు స్వయంగా రంగులు వేశారు. తర్వాత గ్రామస్తులతో మాట్లాడారు. రామవరంలో పల్లెప్రగతి పనులు బాగా చేసినందున నర్సరీకి ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షలు, సీసీరోడ్లకు రూ. 20 లక్షలను ఎస్‌టీఎఫ్‌ నిధుల నుంచి మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే 30 రోజుల ప్రణాళికలో చేసిన యాక్షన్‌ పనులకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శిరీష మల్లేశ్‌, గ్రామ ప్రత్యేక అధికారి, ఏపీవో నరిగె కుమారస్వామి, ఎంపీవో చంద్రశేఖర్‌, ఎస్సై సతీశ్‌, ఏఎస్‌వో శీలం నరేశ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహేందర్‌ పాల్గొన్నారు.


logo