సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 12, 2020 , 04:49:05

ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు


పాలకుర్తి రూరల్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరారు. బమ్మెర ఉప సర్పంచ్‌ శివరాత్రి సుధాకర్‌, వార్డు సభ్యుడు కిష్టం రాజు, జ్యోతి నాగరాజు, యూత్‌ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేందర్‌తోపాటు సుమారు 50 మంది మంత్రి  సమక్షంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపి ఏడాదంతా మత్తడి పారిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, వైఎస్‌ ఎంపీపీ దార శారద శంకరయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బత్తిని సోమయ్య, బత్తిని గోపాల్‌, జోగు గోపి, జిట్టబోయిన కొంరెల్లి పాల్గొన్నారు.


logo