ఆదివారం 24 మే 2020
Jangaon - Jan 12, 2020 , 04:48:08

ఎంచుకున్న పనులు పూర్తి చేయాలి

ఎంచుకున్న పనులు పూర్తి చేయాలి
  • -కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
  • -చినమడూరు, పెదమడూరులో

దేవరుప్పుల, జనవరి 11:  రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఎంచుకున్న పనులు వంద శాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని చినమడూరు, పెదమడూరు గ్రామాల్లో  కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి సర్పంచ్‌, పంచాయత్‌ కార్యదర్శులను వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నర్సరీలు, స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాల్లో జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆకవరం సుజనారెడ్డి, వంగ పద్మ, ఎంపీటీసీలు పానుగంటి గిరి, గొడుగు సుజాత, ప్రత్యేకాధికారులు రామకృష్ణ, శ్రీకాంత్‌, శ్రీకాంత్‌చ పంచాయత్‌ కార్యదర్శులు మంగ్నా, శివారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దారెడ్డి, సంజీవరెడ్డి, మల్లికార్జున్‌, అర్జున్‌, జోగేశ్వర్‌ ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

అధికారుల తనిఖీ

కొడకండ్ల : మండల పరిధిలో రెండోవిడతలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను శనివారం రాత్రి జేసీ ఓజే మధుతోపాటు పలువురు జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిర్నితండా, చెరువు ముందుతండా, మొండ్రాయి గ్రామంలో కొనసాగుతున్న పనులను తనిఖీ చేశారు. జేసీ వెంట జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఏడీ కోర్నియాల్‌, ఐబీడీఈ రవీందర్‌ రెడ్డి, డీపీ వో వెంకటేశ్వర్లు, డీఎల్పీవోలు కనకదుర్గ, గంగాభవానీ, జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి వెంకటరమణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతిరావుఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీడీవో డాక్టర్‌ రమేశ్‌, ఏపీవో కుమారస్వామి, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


logo