శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 12, 2020 , 04:47:21

అభివృద్ధే ధ్యేయంగా పల్లెప్రగతి

అభివృద్ధే ధ్యేయంగా పల్లెప్రగతి
  • -జెడ్పీ చైర్మన్‌ పాగాల, ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య


చిలుపూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం అభివృద్ధే ధ్యేయంగా కొనసాగుతున్నదని  జెడ్పీ చైర్మన్‌ పాగాల, ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీలను శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నపెండ్యాల సర్పంచ్‌ మామిడాల లింగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచినట్లే గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. ఇంటింటిరీ మొక్కలను నాటాలన్నారు. అనంతరం  పల్లగుట్ట గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ద్యేయంగా సీఎం కేసీఆర్‌ పథకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత కనిపిస్తే ఆ ఇంటి యజమానులకు జరిమానా విధించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. చిన్నపెండ్యాల, పల్లగుట్ట, రాజవరం, వెంకటాద్రిపేట, మల్కాపూర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, శ్రీపతిపల్లి గ్రామాల్లో నర్సరీ నిర్మాణాలతో పాటు వీధి దీపాలను ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మామిడాల లింగారెడ్డి, బొట్టు మానస,తిరుమలకృష్ణమోహన్‌రెడ్డి, రఘుపతి, రవి, రవీందర్‌, రజిత, కేసిరెడ్డి ప్రత్యుషారెడ్డి, రాజ్‌కుమార్‌, ఎంపీటీసీలు ఉమసమ్మయ్య, ఝాన్సీరాణి, ఎన్నకూస కుమార్‌, సుధాకర్‌, రవీందర్‌, ఐలమ్మ, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత, వైస్‌ ఎంపీపీ భూక్యా సరిత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రవీందర్‌రావు, పొట్లపెల్లి శ్రీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ నియోజక వర్గ సలహాదారు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ జనగామ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, గజ్జెల దామోదర్‌, సంపత్‌, ఇల్లందుల సుదర్శన్‌, బత్తుల రాజన్‌బాబు, మార్కెట్‌ చైర్మన్‌ స్వర్ణలత, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌నాయక్‌, బీ బాలరాజు, జీ వెంకటస్వామి, రమేశ్‌నాయక్‌, రంగు రమేశ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ ఇసురం వెంకటయ్య, బత్తిని శ్రీను, చేరాలు, ఈక శ్రీను, భీములు, ఎంపీడీవో రాధాకృష్ణకుమారి, ఏడీఈ పాపిరెడ్డి, ఏఈ సందీప్‌పాటిల్‌, ఎంపీవో సురేశ్‌, సతీశ్‌, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. కాగా చిన్నపెండ్యాలకు చెందిన కొత్తూరి రమేశ్‌ అనే యువకుడికి పెరాలసిస్‌తో కాళ్లు చచ్చుబడిపోగా నిరాశ్రయుడైన తనకు సదరన్‌ సర్టిఫికెట్‌ ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్యను శనివారం బాధితులు వేడుకున్నారు.


logo