e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జనగాం ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు

ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు

భక్తి శ్రద్ధలతో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలు
ఘనంగా అమ్మవారి విగ్రహాలను ఊరేగించిన భక్తులు
సమీపంలోని చెరువులో నిమజ్జనం

మహబూబాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 16: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. జిల్లాలో అమ్మవా రి విగ్రహాలను ప్రతిష్ఠించి, తొమ్మిది రోజులపాటు భక్తిప్రపత్తులతో పూజ లు నిర్వహించారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రతిరోజు మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చివరిరోజు దుర్గామాత విగ్రహాలను డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 20 అమ్మవార్ల విగ్రహాలను నిజాం చెరువులో నిమజ్జనం చేశారు. దీంతో దేవి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
కురవి, అక్టోబర్‌ 16: మండల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన దుర్గాదేవీ అమ్మవారి ప్రతిమలను భక్తులు శనివారం ఘనంగా నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవీ విగ్రహాన్ని శావపై ఊరేగించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ కురవి పెద్దచెరువులో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
డోర్నకల్‌: మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహానికి కమిటీ సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు. పుర వీధుల్లో ఊరేగించి అనంతరం ఊర చెరువులో నిమజ్జనం చేశారు. శోభాయాత్రలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, వార్డు కౌన్సిలర్‌ పోటు జనార్దన్‌, మున్సిపల్‌ కోఅప్షన్‌ సభ్యులు అజిత్‌ మియా, రాంభద్రం, నాయకుడు కొత్త రాంబాబు పాల్గొన్నారు.
కేసముద్రం: మండలంలోని కేసముద్రం స్టేషన్‌, కల్వల, ఉప్పరపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లో దుర్గామాత శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీరాంచద్రన్‌ కుమార్‌, సంతోష్‌, మాల రవి, ఓలం ప్రభుకిరణ్‌, లంకపల్లి సంతోశ్‌, గంధసిరి రాజేశ్‌, మనోజ్‌ పాల్గొన్నారు.
నర్సింహులపేట: మండల కేంద్రంతోపాటు పెద్దనాగారం, కొమ్ములవంచ, పడమటిగూడెం, జయపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం చెరువుల్లో నిమజ్ఞనం చేశారు.
గార్ల: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఘనంగా ఊరేగించారు. అనంతరం పాకాల ఏరులో నిమజ్జనం చేశారు. సీతంపేట, మార్రిగూడెం, పోచారం, గ్రామాల్లో భక్తులు అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. శోభాయాత్రలో అర్చకులు రామశాస్త్రి, కేఎల్‌ఎన్‌ చార్యులు, భక్తులు కట్టా రమేశ్‌, గుగులోత్‌ శ్రీను, కట్టా అరుణ, నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement