e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జనగాం సద్దుల సంబురం..

సద్దుల సంబురం..

జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆడిపాడి మురిసిన ఆడబిడ్డలు
సందడి చేసిన పిల్లలు, పెద్దలు
సద్ధులతో సాగనంపిన మహిళలు
భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి గౌరమ్మ
పోలీసుల భారీ బందోబస్తు
ఊరూరా సద్దుల బతుకమ్మ వేడుకలు

స్టేషన్‌ ఘన్‌పూర్‌, 14 : స్టేషన్‌ ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంతో పాటు మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగా యి. స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ కట్టపై బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో కట్టపై చేరుకుని బతుకమ్మ ఆడిపా డారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వార్‌ కట్టపై మహిళలతో బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పట్టేది బతుకమ్మ ఆట అని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక పండుగలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేశారన్నారు.

- Advertisement -

పాలకుర్తి /పాలకుర్తి రూరల్‌ : తెలంగాణ సంస్కతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతి ప్రసాదమైన తంగె డు గునుగు పూలతో పాటు రంగులు రంగులతో అలకరించిన బతుకమ్మ సద్దులతో గౌరమ్మ గురువారం గంగమ్మ ఒడి కి చేరింది. పాలకుర్తి ఊరచెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పస్నూరి నవీన్‌ కు మార్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కూ రాంబాబు, సర్పంచ్‌లు ఇమ్మడి ప్రకాశ్‌, కల్వల భాస్కర్‌రెడ్డి, పార్వతి, కొమురయ్య, పుస్కూరి కళికంగరావు, యాకయ్య పాల్గొన్నారు.

నర్మెట: మండలంలోని వెల్దండ, అమ్మాపురం, కన్నెబోయినగూడెం, హన్మంతాపూర్‌, మల్కపేట, బొమ్మకూర్‌ తదితర గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. సద్దుల సంబురాలు మండలంలో అం బరాన్నంటింది. పూల సింగిడిని తలపించింది. గ్రామాల్లో సర్పంచ్‌లు లైట్లు, సౌండ్‌ సిస్టంను ఏర్పాట్లు చేశారు.

దేవరుప్పుల: దేవరుప్పుల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరోనాతో రెండేళ్లుగా ఆయా వాడల్లోనే జరుపుకున్న బతుకమ్మ సంబురాలు నేడు సామూహికంగా ఘనంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగుపూలు, బంతి, చామంతి, కట్ల పూలతో భారీ బతుకమ్మలు చేయగా, మహిళలు తమ బతుకమ్మలతో భారీ ర్యాలీగా వాగు, చెరువు గట్ల వద్ద బతుకమ్మలు పెట్టి ఆడిపాడారు. అనంతరం నీటిలో వదిలి పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ బతుకమ్మను సాగనంపారు.

జఫర్‌గఢ్‌: మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జఫర్‌గఢ్‌, సాగరం, కూనూరు, ఉప్పుగల్లు, తమ్మడపల్లి(జీ), తిడుగు, కోనాయిచలంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువు గట్ల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడిపాడారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై కిశోర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

లింగాలఘనపురం: మండలంలోని గ్రామ గ్రామానా గురువారం సద్దుల బతకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందస్తుగానే ఆయా గ్రామ పంచాయతీలు బతుకమ ఆటల ప్రదేశాలైన చెరువుల సమీపంలో నేలను డోజర్లు, ట్రాక్టర్లతో చదను చేయించారు. లింగాలఘనపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ సాదం విజయమనోహర్‌, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్‌ కేమడి కవితవెంకటేశ్‌, ఎంపీటీసీ కేమడి భిక్షపతి, మాజీ సర్పంచ్‌లు గట్టగల్ల యాదయ్య, బోయిని యాదగిరి స్వామి, కేమిడి సాయిమల్లయ్య, కేమిడి అరుణ, మాజీ ఎంపీటీసీలు గవ్వల మల్లేశం, నీలం లక్ష్మి, మాజీ విండో డైరెక్టర్లు ఎడ్ల రాజు, నీలం మోహన్‌, మాజీ ఉపసర్పంచ్‌లు కేమిడి వీరస్వామి, జాగిళ్లపురం ఉప్పలయ్య, నాయకులు ఏదునూరి వీరన్న, లీడర్‌ యాదగిరి,బింగి స్వామి, బోయిని సాయిలు, బెజ్జం రాం నర్సయ్య, బెజ్జం చంద్రయ్య,కారంపురి శ్రీనివాస్‌, బిట్ల ఉప్పలయ్య, కేమిడి వీరసాయి మల్లేశ్‌, లింగాల ప్రభాకర్‌, మంద శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రఘునాథపల్లి: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపు కున్నారు. మండలంలోని కోమ్లాలలో ఎంపీపీ మేలక వరల క్ష్మి, నిడిగొండలో టీఆర్‌ఎస్‌ నియోజక వర్గం ఇన్‌చార్జి మడ్లప ల్లి సునిత సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొడకండ్ల: మండల కేంద్రలో సర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామవరం గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సిందె రామోజీ పాల్గొన్నారు. ఎస్సై పవన్‌ కుమార్‌ పర్యవేక్షణలో బతుకమ్మ వేడుకలు ప్రశాంతగా నిర్వహించారు. అదే విధంగా మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్‌ పేరం రాము, ఎంపీటీసీ అందె యాకయ్య, డైరెక్టర్‌ దూలం సతీశ్‌, కోటగిరి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ఎండీ ఆసీఫ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కుందూరు అమరేందర్‌ రెడ్డి, దేశగాని సతీశ్‌, ఉప సర్పంచ్‌ బోయిని రమేశ్‌, వార్డు సభ్యులు కుంచం హరీశ్‌, కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తరిగొప్పుల: మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ ముక్కెర బుచ్చిరాజ్‌ యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం ఆనందదాయకమ న్నారు. తహసీల్దార్‌ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మ్‌హన్‌ రెడ్డి, సర్పంచ్‌లు దామెర ప్రభుదాస్‌, బెల్లపు రాజు, అమిరిశేట్టి వీరేందర్‌, భూక్యా రవి, ఎంపీటీసీలు అర్జుల మధుసూదన్‌ రెడ్డి, భూక్యా జూంలాల్‌ నాయక్‌, పోగుల చంద్రమౌళి పాల్గొన్నారు.

బచ్చన్నపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. కట్కూర్‌లో ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు తన మనవరాలుతో కలిసి బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి ఆడారు. బతుకమ్మ పండుగ ప్రశాంతంగా జరిగేలా ఎస్సై లక్ష్మన్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement