ఓటర్ల తుది జాబితా విడుదల
278 పోలింగ్ స్టేషన్ల ప్రకటన
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల నియామకం
నేడు డివిజన్లవారీగా రిజర్వేషన్లు ఖరారు
లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ల ఎంపిక
రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో డ్రా
నామినేషన్లకు రెండు చోట్ల ఏర్పాట్లు
వరంగల్, ఏప్రిల్ 14: గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం బుధ వారం డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను సిద్ధం చేసిన అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. ఆయన ఓటర్ల తుది జాబితాను సీడీఎంఏకు అందించారు. గురువారం అధికారి కంగా డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబి తాను ప్రకటించి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికా రులు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నోటీస్ బోర్డుపై బుధవారం రాత్రి అంటించారు.
878 పోలింగ్ స్టేషన్లు
66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహి స్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లలో 800 ఓట్లకు మిం చకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను ఎన్నికల అధికారి నియమించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వర కు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్ అ ధికారులు, పోలీస్ అధికారులు, వీడియో గ్రాఫర్ ఉంటారు.
నేడు డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రకటన
డివిజన్ల వారీగా రిజర్వేషన్లను గురువారం ఖరారు చేయ నున్నారు. 66 డివిజన్లలో 33 మహిళలకు కేటాయించను న్నారు. మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో చేపడుతారు. కలెక్టర్ నేతృత్వంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతిని ధుల సమక్షంలో ఖరారు చేస్తారు. నేడు ఉదయం 10 గంట లకు కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చా రు.
నామినేషన్లకు రెండు చోట్ల ఏర్పాట్లు
ఎన్నికల నామినేషన్ల పర్వానికి గ్రేటర్ అధికారులు రెండు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆర్వోల వారీగా గదులు కేటాయించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లకు గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి లేఖ రాశారు. ఎల్బీ కళా శాలలో 34 డివిజన్లకు, ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో 32 డివి జన్లకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 29, 30, 31, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66 డివిజన్ల నా మినేషన్లు, ఎల్బీ కళాశాలలో 1, 2, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 డివిజన్ల నామినేషన్లు స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.