e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home జనగాం సద్దులకు వేళాయే..

సద్దులకు వేళాయే..

ములుగు, జయశంకర్‌ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి
పూల కొనుగోలుదారులతో సందడి
సంబురాలకు వేదికగా ములుగు మినీ ట్యాంక్‌బండ్‌
బతుకమ్మ ఆట స్థలాల వద్ద విద్యుత్‌ దీపాల ఏర్పాటు

ములుగు, అక్టోబర్‌13 (నమస్తేతెలంగాణ)/ కృష్ణకాలనీ : ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మ పండుగ ఆనవాయితీ. ప్రతీ సంవత్సరం మహిళలు బతుకమ్మ నే పూల దేవతగా పూజిస్తారు. బొడ్డె మ్మ మొదలు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడిన మహిళలు చివరి రోజు సద్దులను వేడుకగా నిర్వహిస్తారు. ఇందు కోసం ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ప్రభు త్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ములు గు జిల్లా కేంద్రం నుంచి మదనపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న తోపుకుంటపై నిర్మించిన మినీ ట్యాంక్‌ బండ్‌పై నూతనంగా బతుకమ్మ తల్లీ బిడ్డల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహిళలకు స్వాగతం పలికేందుకు ఆకర్షణీయమైన స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి మున్సిపల్‌ అధికారులు ఆట స్థలాలను చదును చేసి విద్యుత్‌ దీపాలను అర్చారు. అలాగే జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాలు బతుకమ్మ వేడుకలకు ముస్తాబయ్యాయి. కరోనా కారణంగా గత సంవత్సరం సద్దుల బతుకమ్మను నామమాత్రంగా జరుపుకున్న ప్రజలు ప్రస్తుతం భారీ ఎత్తున సద్దులతో పాటు దసరా పండుగను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.
పూల కొనుగోలుదారులతో సందడి
మహిళలకు అతి పెద్ద పం డుగ అయిన సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించుకునేందుకు అవసరమైన వివిధ రకాల పూల కొనుగోలు దారులతో బుధవారం జిల్లా కేంద్రాలు సందడిగా మారాయి. జా తీయ రహదారికి రెండు వై పులా పూల విక్రయదారుల తో పాటు రైతులు వివిధ రకాల పూలను విక్రయించేందుకు దుకాణాలను ఏర్పాటు చేయగా కొనుగోలు దారులతో కిటకిటలాడింది. జయశంకర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌తో పాటు ప్రధాన కూడళ్లలో రంగురంగుల పూల దుకాణాలు దర్శనమిచ్చాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement