e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జనగాం అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి

అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి

మేయర్‌ గుండు సుధారాణి
ఆస్కీ ప్రతినిధులతో సమావేశం

వరంగల్‌, అక్టోబర్‌ 13: ఇటీవల ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 లో భాగంగా అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళి కలు సిద్ధం చేయాలని మేయర్‌ గుండు సుధారాణి అ న్నారు. బుధవారం కార్పొరేషన్‌లో ఆస్కీ ప్రతి నిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. అమృత్‌ 2.0లో భాగంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో వాహనాల కొను గోలు, ఫ్రెష్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, థీమ్‌ పార్క్‌ లు, వాటర్‌ హార్వెస్టింగ్‌, కమ్యూనిటీ సెప్టిక్‌ టాయ్‌ లెట్ల నిర్మాణం, మానవ వ్యర్థాలను శుద్ధీక రణ కేంద్రానికి తరలించేలా చూడడం, ఎస్‌టీపీలు లాంటి అంశాలపై ఆమె ఆస్కీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడు తూ భవిష్యత్‌లో ఆస్కీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలకు సమగ్ర ప్రణాళికలు చేయాలని సూచించారు. గ్రేటర్‌ పరిధిలో ఒక ప్రాంతంలో ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని మోడల్‌గా వాటర్‌ హార్వెస్టింగ్‌ చేసేలా ప్రణాళికలు రూపొం దించాలని అన్నారు. సమావేశంలో చీఫ్‌ ఎంహెచ్‌ వో డాక్టర్‌ రాజారెడ్డి, ఆస్కీ డైరక్టర్‌ శ్రీనివాసా చారి, ప్రొఫెసర్‌ మాలిని రెడ్డి, ప్రతినిధులు రాజ్‌ మోహన్‌రెడ్డి, అవినాష్‌, ఓంప్రకాశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నగర మహిళలకు మేయర్‌ గుండు సుధా రాణి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా నగర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆమె భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మేయర్‌
హనుమకొండ చౌరస్తా: హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వల్లాల జగన్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన బతుకమ్మ వేడుకల్లో మేయర్‌ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ, వైస్‌ ప్రెసిడెంట్స్‌ గిరిజ, అన్నపూర్ణ, దాండియా శివకుమార్‌, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కార్యదర్శి కంది శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్స్‌ గిరిజ, అన్నపూర్ణ, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ తడక కుమారస్వామి, కోఆర్డినేటర్‌ జంగా గోపా ల్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌, అడ్వైజర్స్‌ డాక్టర్‌ సీహె చ్‌ రాజయ్య, కేతిరెడ్డి విజయలక్ష్మి, వీ సత్యనా రాయణ, కార్యవర్గ సభ్యులు చంద్రకళ, ప్రసూ నారెడ్డి, రేవతి, ఉషామార్త, సంతోష్‌, రవీందర్‌, నన్నే సాహేబ్‌, చంద్రశేఖర్‌, రాంగోపాల్‌రెడ్డి, చర ణ్‌, సత్యపాల్‌గౌడ్‌, మధు, మేఘనాథ్‌, సెక్యూరిటీ నాయక్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మేయర్‌ను కలిసిన ఓసిటీ దసరా ఉత్సవ కమిటీ
కాశీబుగ్గ: వరంగల్‌ కాశీబుగ్గ ప్రాంతంలోని ఓసిటీ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధ వారం గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధా రాణిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉత్సవాలకు శాశ్వత స్థలం ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కమిటీ అధ్యక్షుడు దూపం సంప త్‌కుమా ర్‌, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్‌, కన్వీనర్‌ బయ్యాస్వామి, సభ్యులు రామ రమేశ్‌, రాచర్ల శ్రీనివాస్‌, సిద్దోజు శ్రీనివాస్‌, ఓం ప్రకాష్‌ కోలారియా, రామా యాదగిరి, వలపదాసు గోపి, సిలువేరు థామస్‌, గుత్తికొండ నవీన, మార్త ఆంజ నేయులు గుల్లపెల్లి రాజ్‌కుమార్‌, భూక్యా మోతీ లాల్‌నాయక్‌, చింతం రాజు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement