e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home జనగాం ప్రభుత్వ పాఠశాలలకు రూ. 20 వేల సామగ్రి వితరణ

ప్రభుత్వ పాఠశాలలకు రూ. 20 వేల సామగ్రి వితరణ

జనగామ చౌరస్తా, అక్టోబర్‌ 13 : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ అధ్యక్షుడు జైన రమేశ్‌ సోదరుడు కిశోర్‌-హరిత దంపతుల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌వాడ ప్రభుత్వ పాఠశాలకు బీరువాతో పాటు వీవర్స్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఫర్నిచర్‌, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా సామగ్రిని మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున లింగయ్య, డీఈవో రాము చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వితరణ చేసిన సామగ్రి విలువ రూ. 20 వేలు ఉంటుందని క్లబ్‌ అధ్యక్షుడు జైన రమేశ్‌ తెలిపారు. అనంతరం వర్ధన్‌ అనాథశ్రమానికి పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు రమేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున, డీఈవో రాము మాట్లాడుతూ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వస్తువులను వితరణ చేసిన జైన కిశోర్‌-హరిత దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ మొదటి జిల్లా ఉప గవర్నర్‌ కన్న పరశురాములు, పూర్వ జిల్లా గవర్నర్‌ కాసం అంజయ్య, రీజియన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, తిరుపల్లి కృష్ణారెడ్డి, క్లబ్‌ సీనియర్‌ నాయకులు పజ్జూరి గోపయ్య, మున్సిపల్‌ కౌన్సిలర్లు గుర్రం భూలక్ష్మి, బొట్ల శ్రీనివాస్‌, జైన సంధ్యారాణి, యాదగిరి, బాలమణి, ధనలక్ష్మి, మోహన్‌రెడ్డి, మహేశ్‌, ప్రమోద్‌, కృష్ణ బజాజ్‌, క్లబ్‌ సభ్యులు బద్రీనాథ్‌ దోర్నాల రమేశ్‌, శ్రీనివాస్‌ రావు, బెలిదె అంజయ్య, చారబుడ్ల సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement