e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం ఆశాకిరణం ఆయిల్‌పామ్‌

ఆశాకిరణం ఆయిల్‌పామ్‌

30ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే కల్పతరువు
ఎకరాకు రూ.2లక్షలు వచ్చే అవకాశం
‘ఆయిల్‌ఫెడ్‌’ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం
తొర్రూరులో ఫ్యాక్టరీ, నర్సరీ
నేడు 400 మంది రైతులకు అవగాహన సదస్సు

హాజరుకానున్న మంత్రి దయాకర్‌రావు, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి
ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకుంటుంది.. చీడపీడలకు ఎదురొడ్డి నిలబడుతుంది.. కోతులు, అడవి పందులు, దొంగలకు అవకాశం ఇవ్వనిది.. ఏటా రూ.2లక్షల చొప్పున 30ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే కల్పతరువది.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ‘ఆయిల్‌పామ్‌’ సాగువైపు ప్రోత్సహిస్తున్నది. పండిన పంటకు ప్రత్యేక ఫార్మర్‌కోడ్‌, దిగుబడులకు పక్కా మార్కెటింగ్‌, వారానికి రెండు సార్లు నేరుగా రైతు ఖాతాల్లోకే డబ్బు జమ చేసే సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇప్పటికే అనేక జిల్లాల్లో పామాయిల్‌ సాగుకు అంకురార్పణ జరగ్గా, ఉమ్మడి జిల్లాలోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సాగుపై అవగాహన కల్పించేందుకు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల నుంచి 150మంది రైతులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖమ్మం జిల్లాలో క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లడం, నేడు 500 మందితో తొర్రూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేందుకు శుభపరిణామంగా తోస్తున్నది.

 • తొర్రూరు, ఆగస్టు 5
  ఎకరాకు రూ.2లక్షలు వచ్చే అవకాశం

  ఆయిల్‌ఫెడ్‌’ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం
  తొర్రూరులో ఫ్యాక్టరీ, నర్సరీ
  నేడు 400 మంది రైతులకు అవగాహన సదస్సు

  హాజరుకానున్న మంత్రి దయాకర్‌రావు, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి
  తొర్రూరు, ఆగస్టు 5 : ఉమ్మడి రాష్ట్రంలో కష్టసాధ్యమైన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌ రైతులకు అన్నీ తానై పంటల సాగులో దిశానిర్దేశం చేస్తున్నారు. మూస పద్ధతిలో సాగుచేస్తే ఫలితం ఉండదని పంటల మార్పును ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్‌పాం సాగును సూచించారు. మొక్కలు నాటిన నుంచి కాతకు వచ్చేదాకా ఎకరానికి రూ.36వేల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రైతులను క్షేత్ర ప్రదర్శనలకు తీసుకెళ్తున్నారు. అవగాహన కల్పించేందుకు సదస్సులు పెడుతున్నారు. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల నుంచి రైతులను ప్రజాప్రతినిధులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక బస్సుల్లో ఖమ్మం జిల్లా పర్యటనకు గురువారం తీసుకెళ్లారు. నేడు తొర్రూరులో 500 మంది రైతులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
  మనవద్ద అనుకూలమైన నేలలు
  నిత్య కరువు, వచ్చీరాని కరంట్‌తో అల్లాడిన తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద దిక్కుగా మారి కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన నీటి వసతి, 24గంటల కరంటు సదుపాయాలు కల్పించారు. పెట్టుబడి సాయం, ఎరువులు అందిస్తూ బీళ్లను సైతం పచ్చని పొలాలుగా మార్చారు. వరి, పత్తి, మిర్చి వంటి సంప్రదాయ పంటలే కాకుండా ఆంధ్రా కంటే ఎంతో అనుకూలమైన నేలలున్న తెలంగాణలో కొత్తరకం పంటల సాగు తో సిరులు పండించొచ్చని ఆయిల్‌పామ్‌ వైపు ప్రోత్సహిస్తున్నారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న మహబూబాబాద్‌ వంటి జిల్లాలో 70వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. సాగుపై రైతుల్లో అవగాహన కలిగించేలా ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ సహకారంతో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
  30ఏళ్ల పాటు అంతర పంటల సాగుకు అవకాశం..
  ఆయిల్‌పామ్‌ తోటలను సాగుచేసే వారు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలున్నాయి. మొక్క నాటిన నాలుగేళ్ల వరకు కూరగాయలు, మక్క, పల్లి, పత్తి, అరటి, బొప్పాయి వంటి వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాలుగేళ్ల తర్వాత గెలలు వేసి దిగుబడి మొదలవుతుంది. అప్పటినుంచి మరో 25ఏళ్ల వరకు చాక్లెట్‌ పంటను ఏటా అంతర పంటగా సాగు చేయవచ్చు. చాక్లెట్‌ తయారీ కంపెనీ వారే విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేసి ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఎకరాకు ఇలా రూ.30వేల నుంచి రూ.40వేల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ తోటలకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, కోతులు, అడవి పందులు, దొంగల బెడద ఉండదు.
  ఎకరాకు రూ.2లక్షల దాకా ఆదాయం..
  ఎకరా స్థలంలో త్రిభుజాకార పద్ధతిలో 57 మొక్కలు నాటుతారు. ప్రతి మొక్క ఏటా 12 నుంచి 14 టన్నుల ఆయిల్‌పామ్‌ గెలలను ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ఆయిల్‌పామ్‌ గెలకు రూ.18వేలు ధర పలుకుతున్నది. ఈ లెక్కన ఎకరాకు రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అనుగుణంగా ప్రతి నెలా ధరల్లో వత్యాసం ఉంటుంది. దీంతో పాటు అంతరపంటల ఆదాయం అదనంగా వస్తుంది.
  ఫార్మర్‌ కోడ్‌తో ప్రతి వారం చెల్లింపులు..
  ఆయిల్‌పామ్‌ దిగుబడులను విధిగా కంపెనీలే కొనాలని కేంద్రం ప్రత్యేక చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థల సేకరణ, నిధుల కేటాయింపు ప్రక్రియ మొదలుపెట్టింది. అత్యధికంగా సాగయ్యే ప్రాంతాలకు దగ్గరలోనే మార్కెటింగ్‌ సౌకర్యంతో కూడిన ఫ్యాక్టరీని నెలకొల్పి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేలా ఆయిల్‌ఫెడ్‌ ద్వారా ‘ఫార్మర్‌ కోడ్‌ను (ఎఫ్‌-కోడ్‌) ఇవ్వనుంది. దిగుబడులను 24 గంటల్లో నేరుగా ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత ఎఫ్‌-కోడ్‌ ద్వారా కార్యాచరణ ప్రారంభిస్తారు. ఈ కోడ్‌లో రైతు పేరు, గ్రామం, మండలం, సాగు విస్తీర్ణం, దిగుబడి, అంతర పంటల సాగు వివరాలు ఉంటాయి. ప్రతి సోమ, గురువారాల్లో ఆయిల్‌ఫెడ్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది.
  తొర్రూరులో ఫ్యాక్టరీ, నర్సరీ
  తొర్రూరు మండలం గోపాలగిరి వద్ద సుమారు 100 ఎకరాల స్థలంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. హరిపిరాల గ్రామంలోని కోటిలింగాల సమీపంలో 47 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 9లక్షల మొక్కలు ఇక్కడ పెంచనున్నారు. వీటిని 15వేల ఎకరాల్లో నాటొచ్చని ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ జిల్లా అధికారి సురేశ్‌ తెలిపారు. ఇప్పటికే మహబూబాబాద్‌ జిల్లాలో 305 ఎకరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా మొక్కలు సాగవుతున్నాయని, ఈ ఏడాది 2వేల ఎకరాల్లో సాగయ్యేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
  నేడు అవగాహన సదస్సు..
  ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.36వేల సబ్సిడీతో పాటు డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తున్నది. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర వంటి ప్రాంతాల్లో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు శుక్రవారం 500 మంది రైతులకు తొర్రూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ ఎం.సురేందర్‌రెడ్డి, జీఎం సుధాకర్‌రెడ్డి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌ రీసెర్చ్‌ (ఐఐవోపీఆర్‌) పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంవీ ప్రసాద్‌, జిల్లా సెరీ, హార్టికల్చర్‌ అధికారులు హాజరవుతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి తెలిపారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana