అందరికీ అందుబాటులో దూరవిద్య
వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్
ఎస్డీఎల్సీఈ 2021-22 యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
భీమారం, ఆగస్టు5: కాకతీయ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల తరగతుల నిర్వహణకు స్టూడియో నిర్మించనున్నట్లు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటి కొండ రమేశ్ తెలిపారు. కేయూ దూరవిద్య కేంద్రం సెమి నార్ హాల్లో ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ టీ శ్రీనివాస్ రావు అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఇందులో దూరవిద్య 2021-22 డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మి షన్ల నోటిఫికేషన్‌ను వీసీ రమేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో ఆడియో, వీడియో బోధన చేయడానికి ఏ ర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ టీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ దూరవిద్య యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెడుతునట్లు తెలిపారు. గతంలో లాగా అర్హత పరీక్ష నిర్వహించడం లేదని, తప్పని సరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడై ఉంటేనే అడ్మిషన్ ఇస్తామ న్నారు. వర్సిటీ పరిధిలోనే స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తా మని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంక ట్రామ్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మల్లారె డ్డి, కేయూ అభివృద్ధి అధికారి ప్రొఫెసర్ రామ చంద్రం, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుంకరి జ్యోతి, ఎస్డీఎల్సీ ఈ డిఫ్యూటీ డైరెక్టర్ డాక్టర్ సవితాజ్యోత్స్న, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాజేందర్, వెంకయ్య, సదానందం, ఇస్తారి, వీ జగన్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ, కోర్సుల వివరాలు.. బీఏ. బీకాం(జనరల్, కంఫ్యూట ర్స్) బీఎల్ఎస్సీ, బీబీఏ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్)
పీజీ కోర్సులు.. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంసృ తం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎకనమిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, ఎంకాం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ మ్యాథమెటి క్స్, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఎస్సీ ఉంటాయి.
దరఖాస్తు షెడ్యూల్..
కేయూ దూరవిద్య కేంద్రం యూజీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ వరకు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు రూ. 200, 23వ తేదీ నుంచి అక్టోబర్ 11 వరకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 44 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. వివరాలకు దూరవిద్య కేంద్రం వెబ్సైట్ www. sdlceku. co.in, 0870-246140, 2461490లో సంప్రదించాలి.