e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం ఘనంగా నన్నపునేని జన్మదిన వేడుకలు

ఘనంగా నన్నపునేని జన్మదిన వేడుకలు

వరంగల్‌, ఆగస్టు5 : వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరిగాయి. అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేక్‌లుకట్‌ చేయడంతోపాటు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు గందె నవీన్‌ ప్రత్యేకంగా గులాబీ రంగులో కారు కేక్‌ తయారు చేయించగా, దానిని తన ఇంటి ఎదుట ఎమ్మెల్యే నరేందర్‌ కట్‌ చేశారు. అభిమానులు పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోలిపాక శ్రీనాథ్‌, తోట నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. హంటర్‌రోడ్‌ లోని 12మోరీల సెంటర్‌లో ఆటో ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నీలం సుధాకర్‌, కె సురేశ్‌, రమేశ్‌, శ్రీను, కిరణ్‌, రామకృష్ణ, కుమార్‌, నాగరాజు, సందీప్‌, నరేందర్‌, ఫిరోజ్‌ పాల్గొన్నారు.
నరేందర్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్‌, తన్నీరు హరీశ్‌రావు నరేందర్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యే నరేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి స్వీటు తినిపించి శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్యే కలిసిన బత్తిని వసుంధర
కరీమాబాద్‌ : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనను పెరుకవాడలోని తన నివాసంలో మాజీ కార్పొరేటర్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యురాలు బత్తిని వసుంధర మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట బత్తిని అఖిల్‌, బైరగోని మనోహర్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana