శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 08, 2020 , 14:38:43

దాతల సహకారం.. ప్రజాప్రతినిధుల శ్రమదానం!

దాతల సహకారం.. ప్రజాప్రతినిధుల శ్రమదానం!

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెప్రగతి కోసం అధికార యంత్రాంగం పూర్తి దృష్టిసారించింది. రెండో విడతలో భాగంగా మంగళవారం శ్రమదానం, ప్లాస్టిక్ నిషేధిత ర్యాలీలు నిర్వహించారు. జనగామ మండలం శామీర్‌పేట గ్రామానికి చెందిన సాదం ఆనందగజపతి(చిన్న) తన తండ్రి శ్రీరంగం జ్ఞాపకార్థం రూ. 50 వేలు విలువైన ట్రీగార్డ్స్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జరిగిన ప్రగతి పనులపై, మరుసటి రోజు జరిగే కార్యక్రమాలపై ఉన్నతాధికారులు రాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్ పెంబర్తిలో, సోమవారం రాత్రి జేసీ మధు లింగాలఘనపూర్‌లో రాత్రి 11గంటల వేళ వరకు సమావేశాలు నిర్వహించారు. ఉన్నతాధికారులు కృతనిశ్చయంతో పల్లెప్రగతిలో పాల్గొంటున్నారు. బుధవారం కోల్పోయిన పాత మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, నర్సరీల పనులు పూర్తి చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. పెంబర్తిలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీధుల్ని శుభ్రం చేశారు. దేవురుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం, బంజరలో శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు, మంత్రి దయాకర్‌రావు మనవడు కార్తీక్ పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ఉషాదయాకర్‌రావు గ్రామస్తులకు సూచించారు. పల్లెల అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. గొల్లపల్లి, మన్‌పహాడ్‌లో జరుగుతున్న పనుల్ని మండల ప్రత్యేకాధికారి వీరునాయక్ పర్యవేక్షించారు. ప్లాస్టిక్ నిషేధిత ర్యాలీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించారు.


ఎంపీడీవో కుమారస్వామి ఛాగల్లులో శ్రమదానం పాల్గొన్నారు. జఫర్‌ఘడ్ మండలం కోనాయిచలం, తిడుగు గ్రామాల్లో జెడ్పీ సీఈవో రమాదేవి నర్సరీలను సందర్శించారు.


మండల కేంద్రంలో డీఎల్‌పీవో కనకదుర్గ పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించారు. పాలకుర్తి మండలం తీగారం, అయ్యంగారిపల్లిలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను ఆర్డీవో రమేశ్ పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ చేసి మొక్కలు నాటారు. బచ్చన్నపేట మండలం ఆలీంపూర్‌లో డీఎల్‌పీవో గంగాభవాని నర్సరీలు, పారిశుద్ధ్య పనుల్ని చూశారు. కొడకండ్ల మండలంలోని రామవరం, జీబీతండా, కడగుట్టతండా, ఐక్యతండా, పాకలలో మండల ప్రత్యేక అధికారి ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతి పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. వేగంగా పనులు చేయాలని వారు సిబ్బందిని ఆదేశించారు. తరిగొప్పుల మండలం పోతారంలో ఎంపీపీ హరిత, తదితరులు వీధుల్ని శుభ్రం చేశారు. లింగాలఘనపూర్‌లో జేసీ మధు, డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ జయశ్రీ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సురేందర్ సందర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనుల్ని అధికారులు పర్యవేక్షించారు. రఘునాథపల్లి మండలం కోమల్లలోని పశువైద్యశాలలో పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటారు. ఎంపీపీ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


logo