e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జనగాం నాడు అన్యాయం నేడు సాకారం

నాడు అన్యాయం నేడు సాకారం

  • జనగామలో వడివడిగా టెక్స్‌టైల్‌ పార్కు
  • కళ్లెం సమీపంలో 550 యూనిట్లతో పరిశ్రమ
  • వైఎస్‌ హయాంలో కుట్రతో అనంతపురానికి తరలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • ఇప్పుడు సీఎం కేసీఆర్‌ చొరవతో వేగంగా నిర్మాణం
  • యువతకు ఉపాధి లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్కారు
  • రూ.687 కోట్లతో ఏర్పాటు
  • ఇప్పటికే రూ.12.50 కోట్లతో సౌకర్యాలు
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి
  • వచ్చే నెలలో యూనిట్లు ప్రారంభించేందుకు సన్నాహాలు

లింగాలఘనపురం, సెప్టెంబర్‌ 24:జనగామ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కు సిద్ధమవుతున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లింగాలఘనపురం మండలం కళ్లెం పరిధి ఏనెబావి వద్ద సర్వే నంబర్‌ 456లో 116 ఎకరాలు కేటాయించ గా, 550 యూనిట్లతో అతిపెద్ద పరిశ్ర మ ఏర్పాటవుతున్నది. రూ.687 కోట్లతో నెలకొల్పుతున్న ఈ పార్కు కోసం రోడ్లు, విద్యుద్దీపాలు, ప్రహరీ దాదాపు పూర్తయ్యాయి. నిజానికి ఇక్క డ ఎప్పుడో ఈ పరిశ్రమ రావాల్సి ఉండ గా, సమైక్య పాలనలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రలతో అనంతపురం తరలిపోయింది. తాజాగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో మళ్లీ ముందడుగు పడగా, వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇక్కడ రూపుదిద్దుకుంటున్న సోలాపూ ర్‌ సొసైటీ టెక్స్‌టైల్‌ పార్కుతో ప్రత్య క్షంగా 5వేల మందికి పరోక్షంగా మరో 5వేల మందికి ఉపాధి లభించనుంది.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే జనగామకు టెక్స్‌టైల్‌ పార్కు వచ్చింది. జిల్లాకేంద్రానికి సమీపంలో లింగాలఘనపురం మండలం కళ్లెం పరిధిలోని ఏనెబావి వద్ద పరిశ్రమను నెలకొల్పుతుండగా, ఇందుకోసం రాష్ట్ర ప్రభత్వం 116 ఎకరాలు కేటాయించింది. సోలాపూర్‌ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటయ్యే టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కోసం అధికార యంత్రాంగం అన్ని సౌకర్యాలు కల్పించే పనిలో నిమగ్నమైంది. ఇందులో మొత్తం 550 యూ నిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.25 కోట్ల చొప్పున 678కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే పార్కులో రూ.12.50 కోట్లతో రోడ్లు, రూ.కోటితో ప్రహ రీ నిర్మాణ పనులు జరుగుతున్నా యి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. ఒక్కో యూనిట్‌లో 10మంది చొప్పున ప్రత్యక్షంగా 5500 మందికి ఉపాధి లభించనుంది. వచ్చే నెలలో యూనిట్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని యూనిట్లు సిద్ధమైతే పరోక్షంగా మరో 5వేల మందికి పని దొరకనుంది. పార్కు రాకతో హోటళ్లు, చిరు వ్యాపారాలు విస్తరించి స్థానికులకు ఉపాధి లభించనుంది. అంతేగాక పార్కు పరిసరాల్లో భీష్మ జూట్‌ కంపెనీ కూడా ఏర్పాటవుతోంది. ఇందులో రోజూ మరో 200 మందికి ఉపాధి లభించనుంది. ఇలా కరువు నేలలో పరిశ్రమల ఏర్పాటవుతుండడంపై మండలవాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

ఊరించి.. ఉసూరుమనిపించిన వైఎస్‌ సర్కారు..
నిజానికి ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఎప్పుడో ఏర్పాటు కావాల్సి ఉన్నా.. నాటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సర్కారు ఇక్కడి ప్రజలకు మొండిచేయి చూపింది. కళ్లెం సమీపంలో 388 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కామోజీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేస్తామని, దాదాపు 6వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రకటించి ఆశలు రేకెత్తించింది. ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కోసం రూ.60లక్షలు విడుదల చేసింది. అయితే ఆ కంపెనీ ఏర్పాటుకు మరో 60 ఎకరాలు అవసరమైంది. ఇక్కడే సీమాంధ్రుల కుట్రలు బయటపడ్డాయి. హైదరాబాద్‌ నుంచి అప్పటి కాంగ్రెస్‌ నాయకులు ఇక్కడికి చేరుకొని రియల్‌ భూమ్‌ను వేలల్లో ఉన్న ధరలను లక్షలకు పెంచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.30వేల నుంచి రూ.60వేల వరకే ధరలు చెల్లించే అవకాశముండడం, అప్పటికే సీమాంధ్రులు ఇక్కడ భూములను అగ్రిమెంట్లు చేయించుకోవడం, కొనుగోలు చేయడంతో పార్కుకు అవసరమైన భూమి దొరకకుండా పోయింది. అంతేగాక మళ్లీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రావడంతో ఏకంగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను సీమాంధ్రులు అనంతపురానికి తరలించుకపోయారు. ఇలా పార్కు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని ఊరించిన వైఎస్‌ సర్కారు.. అంతలోనే అన్యాయంగా తీసుకెళ్లడం స్థానికులను తీవ్రంగా బాధించింది.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
దశాబ్దాల కిందనే ఇక్కడ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు కావాల్సి ఉండె. అప్పటి సీమాంధ్ర నాయకులు కుట్రలు చేసి అనంతపురానికి తరలించుకపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ఇప్పుడు కళ్లెంలో వస్త్ర పరిశ్రమ ఏర్పాటవుతున్నది. ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు నెరవేరే రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇక్కడ సోలాపూర్‌ సొసైటీ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటవుతోంది. దాదాపు 10వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడి యువతకు ఉపాధి కల్పిందేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటాం.

  • గుడి వంశీధర్‌రెడ్డి, జడ్పీటీసీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement