e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం జనగామ సమీకృత కార్యాలయ భవనం ముస్తాబు

జనగామ సమీకృత కార్యాలయ భవనం ముస్తాబు

 • రూ.58కోట్లతో నిర్మాణం
 • సకల సౌకర్యాలతో భవనం
 • విశాలమైన రోడ్లు, హెలీప్యాడ్‌
 • సెల్లార్‌లో వాహన పార్కింగ్‌
 • ఆవరణ అంతా పచ్చదనం
 • ప్రారంభోత్సవానికి త్వరలోనే ముహూర్తం

జనగామ, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరుగా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటిని తొలగించి అన్ని శాఖల సేవలను ఒకే చోట అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయ భవన నిర్మాణాలను చేపట్టింది. 2016 అక్టోబర్‌ 10న కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా కేంద్రంలో 2017 అక్టోబర్‌ 10న సమీకృత కలెక్టరేట్‌ భవనానికి అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. తొలుత రూ.46కోట్ల అంచనా వ్యయంతో ‘ట్రాట్స్‌ అండ్‌ టవర్స్‌’ కంపెనీ పనులు ప్రారంభించగా..సెల్లార్‌ పార్కింగ్‌ వంటి అదనపు నిర్మాణాలతో ప్రస్తుతం భవన నిర్మాణ వ్యయం రూ.58కోట్లకు చేరుకున్నది. కరోనా ప్రభావంతో ఏర్పడిన కూలీల కొరత, పార్కింగ్‌ సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన పనులతో నిర్మాణంలో కొంత ఆలస్యమైంది.

ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట..
సమీకృత కలెక్టరేట్‌ భవనంలో 31 ప్రభుత్వ శాఖల సేవలన్నీ ఒకేచోట లభించనున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ మున్సిపల్‌ కొత్త భవనం, ధర్మకంచ, వడ్లకొండ రోడ్డులోని ప్రభుత్వ భవనాల్లో దూరదూరంగా వేర్వేరుగా కొనసాగుతున్నాయి. రెండు, మూడు శాఖల పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వారికి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో..ఎంత దూరంలో ఉన్నాయో తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వరంగల్‌-హైదరాబాద్‌ హైవేకు అతి చేరువలో సిద్ధిపేట-సూర్యాపేట ప్రధాన రహదారిపై జనగామ బస్టాండ్‌కు సమీపంలో సకల హంగులతో సమీకృత జిల్లా కార్యాలయాల సమూదాయాన్ని నిర్మించారు.

- Advertisement -

99శాతం పనులు పూర్తి..
కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెక్టర్లు సహా మరో నలుగురు జిల్లా అధికారులకు క్యాంపు కార్యాలయాలు (క్వార్టర్లు), భవనానికి అనుసంధానంగా హెలీప్యాడ్‌ నిర్మాణం సహా గార్డెనింగ్‌, హరితవనం, ఎలక్ట్రిఫికేషన్‌, ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్‌, ఆవరణలో రోడ్లు, లైట్ల ఏర్పాటు, ప్రధాన గేటు నుంచి భవనం సహా క్వార్టర్స్‌ వరకు నాలుగు లైన్ల రోడ్డు, అంతర్గతంగా రెండు లైన్ల రోడ్డు, బయట గార్డెనింగ్‌ సహా భవనం లోపల ప్రతి అంతస్తులోనూ పచ్చదనంతో అందంగా కనిపించేలా పూలమొక్కలు, కుండీల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. చిన్నా చితక పనులు మినహా 99శాతం మేర కంప్లీటయ్యాయి. కొత్త కలెక్టరేట్‌ సహా హన్మకొండ ప్రధాన రోడ్డులో యశ్వంతపూర్‌ వద్ద నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్‌) భవనాన్ని సీఎం కేసీఆర్‌ గతనెలలోనే ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది.

కొత్త కలెక్టరేట్‌ హైలెట్స్‌..

 • భవనం విస్తీర్ణం 1,20,000 చదరపు ఫీట్లు.
 • మొత్తం మూడు అంతస్తులు (గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌).
 • ప్రతి ఫ్లోర్‌లో ఏ, బీ, సీ, డీ బ్లాకులు
 • గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెక్టర్ల చాంబర్లు, సమావేశ హాళ్లు
 • ఫస్ట్‌ ఫ్లోర్‌లో మినిస్టర్‌ చాంబర్‌, సమావేశ హాల్‌
 • 31శాఖలకు గాను ఒక్కోదానికి ఆఫీస్‌ రూం, శాఖాధికారి గది, వెయింటింగ్‌ హాల్‌
 • అధికారుల క్వార్టర్లు-7, కలెక్టర్‌కు 1, అదనపు కలెక్టర్లకు 2, శాఖాధికారులకు 4 క్యాంపు కార్యాలయాలు
 • 400 మంది అధికారులు కూర్చునేలా అతిపెద్ద సమావేశ హాల్‌
 • సముదాయంలోనే ఏటీఎం, జిరాక్స్‌ సెంటర్లు
 • కలెక్టరేట్‌ ముందు ఆవరణలో 12 పీట్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పు, 55 పీట్ల పొడవు కర్రతో అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటు
 • ప్రతి గదికి ఏసీ, మంచి నీటి సౌకర్యం
 • 300 కార్లు, 200 బైక్‌ల పార్కింగ్‌కు వీలుగా సెల్లార్‌లో ఏర్పాట్లు
 • కలెక్టరేట్‌ ఇరువైపులా రెండు లిఫ్టులు
 • భవనం అడుగున 80వేల లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకు, 50వేల లీటర్ల సామర్థ్యంతో సెఫ్టిక్‌ ట్యాంకు
 • భవిష్యత్‌లో ఆడిటోరియం నిర్మాణానికి వీలుగా స్థలం కేటాయింపు
 • ప్రధాన గేటు నుంచి భవనం వరకు, అధికారుల క్వార్టర్స్‌ వరకు నాలుగు లైన్లు, అంతర్గతంగా
 • రెండు లైన్ల రోడ్డు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana