e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జనగాం అకాల నష్టం..అపార నష్టం

అకాల నష్టం..అపార నష్టం

అకాల నష్టం..అపార నష్టం

వాజేడు, ఏప్రిల్‌ 29 : మండలకేంద్రంతో పాటు మండలంలోని ప్రగళ్లపల్లి, జగన్నాథపురం, అరుణాచలపురం, కొప్పుసూరు, పేరూరు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులలో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో సుమారు మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మామిడికాయలు నేలరాలాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడువకుండా రైతులు జాగ్రత్త పడ్డారు.
ఈదురు గాలులతో వర్షం
మంగపేట : మండలంలోని పలు గ్రామా ల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యాన్ని విక్రయించేందుకు కల్లాల్లో ఆరబోయగా కురిసిన అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందారు. మిర్చి కూడా తడిసిందని వాపోయారు. కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట, తిమ్మంపేట, అకినేపల్లి మల్లారం తదితర గ్రామాల పరిధిలో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయని రైతులు బోరున విలపించారు. ఈదురు గాలులతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అకాల నష్టం..అపార నష్టం

ట్రెండింగ్‌

Advertisement