e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home జగిత్యాల పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చింది : సంజయ్‌కుమార్‌

పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చింది : సంజయ్‌కుమార్‌

సారంగాపూర్‌ : పల్లెల ప్రగతే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని రంగపేటలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, పల్లెప్రకృతివనం, వైకుంఠ ధామాలను జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత, గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో సాగుతూ పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. పల్లెప్రగతి ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సీఎం కేసీఆర్‌ నిధులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు. కొవిడ్‌ కష్ట కాలంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆగ లేదన్నారు. అనంతరం జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సహకారంతో గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు.

అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ రమేశ్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఎమ్మెల్యే, జడ్పీచైర్‌పర్సన్లు పరామర్శించి అతడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌ రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్‌, ఎంపీడీఓ పుల్లయ్య, ఏఈ రాజమల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎలేటి నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బాపిరాజు, పార్టీ మండల అధ్యక్షుడు గురాల రాజేందర్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ బెక్కెం జమున, ఎంపీటీసీలు మలేపు విమల, సుధాకర్‌ రావు, ఉప సర్పంచ్‌ రవి, ప్రజాప్రతినిధులు, నాయకులు పల్లపు వెంకటేశ్‌, వెంకట రమణరావు, అమీర్‌, మద్దెల ఆనంద్‌ రాజ్‌, తిరుపతి, శ్రీనివాస్, సుధాకర్‌, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement