e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు

హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు

  • గుర్తించిన పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి
హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు

హుజూరాబాద్‌టౌన్‌, జూలై 21: హుజూరాబాద్‌ రంగనాయకుల గుట్ట దిగువన రెండు వేల ఏళ్లనాటి ఆనవాళ్లను గుర్తించారు. ఇక్కడ ఉన్న గ్రామాన్ని ఏదులాపురమని, కాలక్రమేణా ఇది హుజూరాబాద్‌గా రూపుదిద్దుకున్నదని ప్రముఖ పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తాను పరిశోధించిన వివరాలను వెల్లడించారు. వెడల్పాటి రోళ్లు, దంచి, నూరేందుకు ఉపయోగించిన రోకలిబండతో పాటు అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, ఇనుము ఉకు పరిశ్రమ, కుండల పరిశ్రమ, పెద్ద పెద్ద ఇటుకలు, వీరుల విగ్రహాలు, నాగదేవతలు, భైరవ శిల్పం వంటి చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు చెప్పారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 40కిలోమీటర్లు, వరంగల్‌ జిల్లాకు 30కిలో మీటర్ల దూరంలో ఉన్న హుజూరాబాద్‌ శివారులో రంగనాయకులగుట్ట పరిసర ప్రాంతాల్లో నవీన శిలాయుగం నుంచి మొదలు శాతవాహనుల కాలానికి సంబంధించిన ఆధారా లను కనుగొన్నారు. రంగనాయకులగుట్ట చుట్టూ పూర్వపు హుజూరాబాద్‌ గ్రామం ఉందన్నారు.

సుమారుగా 80 ఎకరాల పాటి మీద అని పిలిచే ఎతె్తైన మట్టి దిబ్బ ఉందన్నారు. ఇంత విశాలమైన పాటి గడ్డ చాలా అరుదు అన్నారు. అన్ని కులవృత్తిదారులతో కూడిన గ్రామం ఉండేదని, దీనినే స్థానికులు ఏదులాపురం ఆని పిలుచుకుంటారన్నారు. ఈ గ్రామానికి తాగు, సాగు నీరు అందించిన పల్లె ఏరు ప్రవాహం పాటి మీది నుంచి ప్రవహిస్తుందన్నారు. సమీపంలో నాగుల చెరువు ఉందన్నారు. ఇక్కడ గుర్తించిన రోళ్లు పరుపు బండలపై కనిపించే వాటికి భిన్నంగా లోతు తక్కువగా, వెడల్పుగా ఉండేవన్నారు. వీటిని ఆయుర్వేద మూలికలు నూరేందుకు ఉపయోగించారని చెప్పారు. పాటిమీద కనిపించిన చిట్టెపు రాళ్లు (ఇనుమును సంగ్రహించగా మిగిలిన వ్యర్థాలు)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. పెద్ద పెద్ద కాగులు, చక్రంపై తయారు చేసే బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద రంగు, గోధుమరంగు, మట్టి పాత్రలు కనిపించాయి. మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్లు కనిపించాయి. తేలికైన ఇటుకలు, గూన పెంకులు లభ్యమైనట్లు వెల్లడించారు.

- Advertisement -

వీరుడి విగ్రహం, శిల్పాలు
హనుమాన్‌గుడి పకన పచ్చటి పొలంలో వీరుడిని చెకిన విగ్రహం ఉంది. కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎకువగా ఈ ప్రాంతంలో కనిపిస్తుందన్నారు. పాటిమీద పూర్వపు శిథిల ఆలయం, హనుమాన్‌ గుడి ఉన్నట్లు ఆయన గుర్తించగా గుట్ట వెనుక నుంచి వెళ్లే తోవ పకన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పం ఉందన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు
హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు
హుజూరాబాద్‌లో పురాతన ఆనవాళ్లు

ట్రెండింగ్‌

Advertisement