e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home జగిత్యాల ‘డబుల్‌' ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి

‘డబుల్‌’ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి

‘డబుల్‌' ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి

19 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 6 న గ్రామసభల్లో లబ్ధ్దిదారుల ఎంపిక
కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌, ఏప్రిల్‌ 12 ( నమస్తే తెలంగాణ): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించా రు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ క్యాంపు ఆఫీస్‌లో కరీంనగర్‌ నియోజకవర్గం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలపై అర్‌అండ్‌బీ, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన వాటికి మంచినీటి , విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఇండ్ల కేటాయింపులో రోడ్డు వెడల్పు లో 50 శాతం ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు లబ్ధ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించాలని, 23 నుంచి 30 వరకు దరఖాస్తులను పరిశీలించి మే 3న ప్రాథమిక జాబితాలను పంచాయతీ కార్యాల యాల్లో ప్రదర్శించాలని కోరారు. మే 6న గ్రామసభల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, వివిధ మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

కొవిడ్‌-19 : ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

బైపాస్ సర్జరీ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు తిరిగొచ్చిన కోవింద్

Advertisement
‘డబుల్‌' ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement