e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జగిత్యాల పల్లెల సమగ్రాభివృద్ధ్దే లక్ష్యం

పల్లెల సమగ్రాభివృద్ధ్దే లక్ష్యం

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం
45 రోజులుగా కార్యక్రమం విజయవంతం
రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్‌
ధర్మపురి, మార్చి 19: పల్లెప్రగతి లక్ష్యాలను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకే ‘పల్లె ప్రగతితోనే గ్రామవికాసం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘పల్లెప్రగతితోనే గ్రామవికాసం కార్యక్రమం’ ఫిబ్రవరి 1న ప్రారంభం కాగా 45 రోజులుగా గ్రామాల్లో గుర్తించిన, పరిష్కరించిన సమస్యలపై శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామవికాస బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. కార్యక్రమం ధర్మపురి నియోజకవర్గంలో 45 రోజులుగా విజయవంతంగా నడుస్తున్నదన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాల సమస్యలు, కల్పించాల్సిన వసతుల వివరాలను రాత పూర్వకంగా సమర్పిస్తే పరిశీలించి వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ‘పల్లెప్రగతితోనే గ్రామవికాసం కార్యక్రమం’ నిర్వహించిన వివరాలను ఎంపీడీవోలు చదివి వివరించారు. ధర్మారం మండలం కటికనపల్లిలో 106 సమస్యలు గుర్తించామని, అందులో దాదాపు 80శాతం సమస్యలు పరిష్కరించామని ఎంపీడీవో జయశీల తెలిపారు. మిగిలిన 20శాతం సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మపురి మండలం దోనూర్‌లో రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించాలని గ్రామస్తులు కోరినట్లు ఎంపీపీ చిట్టిబాబు తెలిపారు. మంత్రి స్పందించి మిషన్‌భగీరథ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీలు చిట్టిబాబు, గోలి శోభ, లక్ష్మి, శంకరయ్య, ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, రాజేందర్‌రావ్‌, సుధారాణి, గోస్కుల జలేంధర్‌, పద్మజ, ఎంపీడీఓలు, తాసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana