e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జగిత్యాల కొనసాగిన లాక్‌డౌన్‌

కొనసాగిన లాక్‌డౌన్‌

కొనసాగిన లాక్‌డౌన్‌

రాజారం, దొంగలమర్రి చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీ
జగిత్యాల టౌన్‌/మెట్‌పల్లి టౌన్‌/కోరుట్ల/ధర్మపురి, మే 15: ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ నాలుగో రోజు శనివారం ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. 10 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేశారు. దీంతో అప్పటివరకు జనసంచారంతో కిటకిటలాడిన మార్కెట్లు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన వారిని హెచ్చరించారు. మల్యాల మండలం రాజారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు. ఆయన వెంట మల్యాల, జగిత్యాల రూరల్‌ సీఐలు కిశోర్‌, కృష్ఱకుమార్‌, ఎస్‌ఐలు తదితరులున్నారు. కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామశివారులో గల దొంగల మర్రి పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిశోర్‌, కొడిమ్యాల ఎస్‌ఐ మామిడి మహేందర్‌ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించి రహదారులపై వచ్చిన 20 మంది ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించినట్లు సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి రహదారులపై వచ్చిన 20 మంది ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించినట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగిన లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement