సినిమా విజయాల్లో కథానాయికలకు క్రెడిట్ ఇచ్చే విషయంలో చిత్రసీమలో వివక్ష కనిపిస్తుందని చెప్పింది మంగళూరు సొగసరి పూజాహెగ్డే. సినిమా పరాజయం పాలైతే హీరోయిన్లపై ఐరెన్‌లెగ్ అనే ముద్ర వేసి వారి కెరీర్‌కు అడ్డంకులు సృష్టిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. హిైట్టెతే మాత్రం హీరో, దర్శకులవల్లే సినిమా ఆడిందని ప్రచారం చేస్తారని పేర్కొంది. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో స్టార్ హీరోల పాలిట లక్కీఛార్మ్గా మారిపోయింది పూజాహెగ్డే. పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తన కెరీర్లో వచ్చిన మార్పులను గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం కావడంతో కెరీర్ ఆరంభంలో కథల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేశా. ఆ తప్పుల వల్ల తొలి సినిమా విడుదలైన తర్వాత ఏడాదిన్నర పాటు అవకాశాల కోసం ఎదురుచూడాల్సివచ్చింది. ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నాపై ఐరెన్‌లెగ్ అనే ముద్రవేశారు. ఆ ప్రచారాల వల్ల నిరాశ ఆవహించింది. మళ్లీ సినిమాలు చేయగలనా అని భయపడ్డాను. నా ప్రమేయం లేని తప్పులకు బాధ్యురాలిని చేయడం బాధించింది. ఆ విమర్శల్ని చాలెంజింగ్‌గా తీసుకొని విజయాల్ని అందుకున్నా. హీరోయిన్ల ప్రతిభను గుర్తించే విషయంలో ఇండస్ట్రీలో చాలా మార్పులు రావాలి’ అని తెలిపింది.