బుధవారం 03 మార్చి 2021
Jagityal - Feb 23, 2021 , 03:14:00

‘ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి’

‘ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి’

జగిత్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గుగులోత్‌ రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో కలెక్టర్‌ డయల్‌ యువర్‌ కలెక్టర్‌, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు.  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 18 మంది ప్రజావాణిలో కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో 11నెలల అనంతరం కలెక్టర్‌ సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చినవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరమే లోపలికి అనుమతించారు. జిల్లా కేంద్రంలోని యావర్‌ రోడ్డును 60 ఫీట్ల నుంచి వంద ఫీట్లకు విస్తరించాలని కలెక్టర్‌కు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

కొడిమ్యాల, ఫిబ్రవరి 22: నమిలకొండలో 417 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, హద్దులు నిర్ణయించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ రవికి ఫిర్యాదు చేసినట్లు ఎంపీటీసీ మల్యాల సుజాత తెలిపారు. ఆమె వెంట గ్రామస్తుడు శోభన్‌ తదితరులున్నారు. 

VIDEOS

logo