సామాన్యుడిలా సంజయ్‌కుమార్

- వాహనాల రిజిస్ట్రేషన్ కోసం
- క్యూలో నిల్చున్న జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్, జనవరి 27 : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ రవాణా శాఖ కార్యాలయానికి సాధారణ వ్యక్తిలా వచ్చి క్యూలైన్లో నిలబడి వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇటీవల రెండు ద్విచక్రవాహనాలను కొనుగోలు చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొన్నారు. బుధవారం స్లాట్ టైమ్ ఉండడంతో జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి గ్రామంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ సాధారణ వ్యక్తిలాగే క్యూలైన్లో నిలబడి వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
మల్లన్న పట్నాలకు హాజరైన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్, జనవరి 27: జగిత్యాల పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున్ గృహంలో బుధవారం నిర్వహించిన మల్లన్న పట్నాలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరై పూజలు చేశారు. నాయకులు రాజు, ముద్దం శేఖర్, ఏనుగుల సురేశ్, సాగర్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల మండలం తక్కల్లపెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గడ్డం హన్మాన్రెడ్డి తండ్రి చుక్కారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ జైపాల్‌రెడ్డి, నాయకులు దశరథరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రమణారెడ్డి, విక్రం, కచ్చు మహేశ్, పొన్నాల రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- ఈ రాష్ట్రాలను నుంచి వస్తే వారం ఐసోలేషన్
- మన సైకాలజీకి తగిన బొమ్మలు తయారు చేయండి..
- ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం: మంత్రి పువ్వాడ
- ఐజేకేతో కూటమిగా ఎన్నికల బరిలోకి: నటుడు శరత్‌కుమార్
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్‌పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా