మంగళవారం 09 మార్చి 2021
Jagityal - Jan 28, 2021 , 03:09:51

వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్‌ కప్‌' టోర్నీ

వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్‌ కప్‌' టోర్నీ

  • పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత 

జగిత్యాల, జనవరి 27: జగిత్యాలలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్న కేసీఆర్‌ కప్‌ జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నీ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో వచ్చే నెల 1 నుంచి 17వ తేదీ దాకా టోర్నీ నిర్వహిస్తున్నామని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్‌ ఠాకూర్‌ ప్రభాత్‌సింగ్‌ తెలిపారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, 48వ వార్డు కౌన్సిలర్‌, దేవేందర్‌ నాయక్‌ రాథోడ్‌, పరశురాం గౌడ్‌, సామ్రాట్‌ ఉన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo