కష్టకాలంలోనూఆగని ప్రగతి

- కరోనాను నిలువరించడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం
- జగిత్యాల కలెక్టర్ గుగులోత్ రవి
కరోనా కష్టకాలంలోనూ అధికారులు, ప్రజాప్రతిని ధులు సమన్వయంతో కదిలారు. జిల్లాను ప్రగతి మార్గంలో నడిపారు. ప్రణాళికాబద్ధంగా సంయ మనంతో ముందుకుసాగి కొవిడ్ మహమ్మారిని నిలువరించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లా ప్రగతిలో దూసుకెళ్తున్నది.
- జీ రవి, జగిత్యాల కలెక్టర్
జగిత్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కష్టకాలంలోనూ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కదిలారని, జిల్లాను ప్రగతి పథంలో నడిపారని జగిత్యాల కలెక్టర్ గుగులోత్ రవి కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిల్లాలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభించినా ప్రజలు, అధికారులు సంయమనంతో ముందుకుసాగి విజయవంతంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. జిల్లాలో 1,51,730 మందికి కరోనా టెస్టులు చేశామని, ఇందులో 10,559 మంది వైరస్ బారిన పడ్డారని, రెండు ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యం అందించామని వివరించారు. జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలు ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా పనిచేస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రైవేట్ దవాఖానల్లో 4,850 ప్రసవాలు జరుగగా, సర్కారు దవాఖానల్లో 5,773 ప్రసవాలు జరిగాయన్నారు. ఇప్పటి వరకు 24,650 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతు బంధు కింద ఈ యేడాది ఇప్పటి వరకు 1,99,797 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేశామని, రైతు బీమా కింద 1,363 మందికి పరిహారం అందించినట్లు చెప్పారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం విజయవంతం కావడంతో అదనంగా లక్ష ఎకరాల్లో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని చెప్పారు. జిల్లాలో 187 కోట్ల వ్యయంతో రోళ్లవాగు ప్రాజెక్టు, బొల్లిచెరువు ఆధునీకరణ తదితర పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. పల్లె ప్రగతి గొప్పగా సాగుతున్నదని, ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్డులు, వైకుంఠధామాల నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అలాగే ఐదు మున్సిపాలిటీలు ప్రగతి పథంలో ఉన్నాయని, అభివృద్ధికి 200 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. 91.29 కోట్ల వ్యయంతో 9,738 యాదవ, కుర్మ సంఘాలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేశామని, రెండో విడుతలో 98 కోట్ల వ్యయంతో గొర్రె పిల్లల పంపిణీని ఇటీవలే ప్రారంభించామన్నారు. జిల్లా ప్రగతికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్ సన్మానించారు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ జీ రాజేశం గౌడ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్లు బేతి రాజేశం, జల్ద అరుణశ్రీ, అదనపు ఎస్పీ నరేశ్ కుమార్, ఆర్డీవోలు మాధురి, వినోద్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ఉన్నారు.
తాజావార్తలు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి