ఆదివారం 07 మార్చి 2021
Jagityal - Jan 27, 2021 , 02:52:57

రూ.5.80 లక్షల ఆర్థికసాయం అందజేత

రూ.5.80 లక్షల ఆర్థికసాయం అందజేత

కథలాపూర్‌, జనవరి 26: దులూర్‌ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కొడిపెల్లి రమేశ్‌ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. గ్రామస్తులు విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి రూ.5.80 లక్షల ఆర్థికసాయాన్ని మంగళవారం అందించారు. రమేశ్‌ది పేదకుటుంబం కావడంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులతోపాటు వారి మిత్రులు విరాళాలు సేకరించారు. ఈ డబ్బులను వారి పిల్లల పేరిట డిపాజిట్‌ చేసి సంబంధిత బాండ్‌ పత్రాలను అందించారు. కాగా ఉప సర్పంచ్‌ రూ.10 వేలు, టీచర్‌ రవి రూ.3వేలు రమేశ్‌ కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దయ్య లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీ నక్క లక్ష్మి, ఉప సర్పంచ్‌ కృష్ణారెడ్డి, నాయకులు ఎంజీ రెడ్డి, లింగారెడ్డి, రాజారెడ్డి, సాయిరెడ్డి, గంగాధర్‌, లింగేశ్వర్‌ పాల్గొన్నారు. 

కొడిమ్యాల, జనవరి 26: పూడూర్‌ గ్రామానికి చెందిన దండవేణి శ్రీకాంత్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి కూతుర్లు శాంభవి, శివానికి పూడూర్‌ ఆటో యూనియన్‌ సభ్యులు, శ్రీకాంత్‌ 10వ తరగతి స్నేహితులు రూ.50వేలు జమ చేసి పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఈ సందర్భంగా బాండ్‌ పేపర్లను ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, తహసీల్దార్‌ స్వర్ణ బాధిత కుటుంబానికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ అధ్యక్షుడు పర్లపల్లి జలేంధర్‌, ఉపేందర్‌ తదితరులున్నారు. హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన వడ్లకొండ సాయి కొన్నిరోజులుగా డయాలసిస్‌తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో  వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉండడంతో నాచుపల్లి గ్రామానికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ యూత్‌ సభ్యులు రూ.4వేల ఆర్థికసాయాన్ని అతడి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు సతీశ్‌, అజయ్‌, స్వామి, మహేశ్‌, సాగర్‌తోపాటు తదితరులున్నారు.  

VIDEOS

logo