గురువారం 04 మార్చి 2021
Jagityal - Jan 26, 2021 , 04:32:42

పట్టణాభివృద్ధికి కృషి

పట్టణాభివృద్ధికి కృషి

  • పార్టీలకతీతంగా నిధులు కేటాయిస్తున్నాం
  • ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
  • కోరుట్ల మున్సిపల్‌ సమావేశం

కోరుట్ల, జనవరి 25: పట్టణాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలోని అన్నివార్డుల అభివృద్ధికి పార్టీలకతీతంగా నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అలాగే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనులపై మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ల సహకారంతో పనులను త్వరతిగతిన పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. మార్చి చివరి నాటికి పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం పట్టణంలోని స్త్రీశక్తి భవన్‌లో న్యాక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా జ్యూట్‌ బ్యాగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మహిళలు తయారు చేసిన జ్యూట్‌ బ్యాగులను ఎమ్మెల్యే కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, కమిషనర్‌ అయాజ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, డీఈ సంపత్‌, ఏఈ సంపత్‌, డీఈ ప్రసాద్‌, ఏఈ రోహిణి, మున్సిపల్‌ డీఈఈ అభినయ్‌కుమార్‌, టీపీవో శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మెట్‌పల్లి కౌన్సిల్‌ సమావేశం

మెట్‌పల్లి టౌన్‌,జనవరి 25: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హాజరై మాట్లాడారు. పట్టణంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. సమావేశంలో 16 అంశాలను ప్రవేశపెట్టగా 14 అంశాలను సభ్యు లు ఏకగీవ్రంగా ఆమోదించారు. అనంతరం మున్సిపల్‌కు మంజూరైన రెండు వాటర్‌ ట్యాంకర్లు, చెత్త సేకరణ కోసం 5 టాటా ఏస్‌ వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 14వ వార్డుకు చెందిన లక్ష్మికి కల్యాణలక్ష్మి  చెక్కును అందజేశారు. మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

ప్రొసీడింగ్‌ పత్రం అందజేత

మెట్‌పల్లి, జనవరి 25: కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లికి చెందిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.4.5లక్షలు మం జూరయ్యాయి. అందుకు సంబంధించిన ప్రొసీడిం గ్‌ పత్రాన్ని సంఘ సభ్యులకు ఎమ్మెల్యే మెట్‌పల్లిలో ని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఆ సంఘ అధ్యక్షుడు సోమయ్య, నాయకులు చంద్రప్రకాశ్‌, సర్పంచ్‌ గంగరాజు, ముత్తయ్య, లచ్చయ్య, అరుణ్‌, రాజేశ్‌, గంగాధర్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ 

కోరుట్ల రూరల్‌, జనవరి 25: జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ గుగ్గిల్ల సురేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, సహకార సంఘ అధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

పరామర్శ

మల్లాపూర్‌, జనవరి 25: రాఘవపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గురిజాల నర్సయ్య భార్య భూదేవి, కొత్త దామరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మెండు గంగారెడ్డి తల్లి నర్సు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సోమవారం పరామర్శించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ కాటిపెల్లి ఆదిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బద్దం నర్సారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo