సోమవారం 08 మార్చి 2021
Jagityal - Jan 23, 2021 , 01:38:00

కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు

కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు

జగిత్యాల అర్బన్‌, జనవరి 22: కరోనా లాక్‌డౌన్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగించిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ గుర్తు చేశారు. జగిత్యాల మున్సిపల్‌ పరిధిలోని 15, 33వ వార్డుల్లో రూ.7లక్షల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, 15వ వార్డులో రూ.4.60లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ సంఘ భవనానికి ఎమ్మెల్యే శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.  కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్‌ మారుతీప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు  తోట మల్లికార్జున్‌, బండారు రజిని, కోరు గంగమల్లు, కూతురు పద్మ, కూసరి అనిల్‌, బొడ్ల జగదీశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

చెరువును నింపాలని వినతి

ఇటిక్యాలలోని చింతల చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపుతామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. చింతలచెరువును ఎస్సారెస్పీ నీటితో నింపాలని గ్రా మస్తులు ఎమ్మెల్యేకు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాలు కురిసినప్పుడు మాత్రమే చెరువులో నీరు నిల్వ ఉంటుందని, చెరువుకు ఎస్సారెస్పీ కాల్వ అనుసంధానం లేకపోవడంతో నింపడానికి అవకాశం లేదని, డీ 52 కాల్వ ద్వారా నింపే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే చింత లచెరువుకు ఎస్సారెస్పీ కాల్వ అనుసంధానం చేసి చెరువును నింపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి, వెంటనే పనులు జరిగేలా చూస్తానని ఇటిక్యాల గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 


VIDEOS

logo