మంత్రి నిరంజన్‌రెడ్డికి ఘనస్వాగతం

మెట్పల్లి, జనవరి 22: వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి జిల్లా సరిహద్దులోని గండి హనుమాన్ ఆలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు స్వాగతం పలికారు. ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సహచర మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు మంత్రి నిరంజన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. ఇక్కడ జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, మున్సిపల్ అధ్యక్షురాలు సుజాత, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, భీమేశ్వరి, జడ్పీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, భారతి, ఏఎంసీ చైర్మన్లు జరపుల భారతి, కదుర్క నర్సయ్య, మున్సిపల్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు మార్గం గంగాధర్, డాక్టర్ సత్యనారాయణ, మాడిశెట్టి ప్రభాకర్, మెడిచెల్మెల నాని, ఒజ్జెల శ్రీనివాస్ తదితరులున్నారు.
నిధులు కేటాంయించాలని వినతి
రాయికల్ మార్కెట్ యార్డుకు నిధులు కేటాయించాలని పాలకవర్గ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి మల్లాపూర్‌లో శుక్రవారం వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ పాలకవర్గ సభ్యులు గన్నె రాజిరెడ్డి, కొల్లూరి వేణు, జోగినపెల్లి తిరుపతి గౌడ్, మహేశ్, కమలాకర్, తలారి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి విన్నపం
ఇబ్రహీంపట్నం: గోదూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం కావాలని సర్పంచ్ సోమ ప్రభాకర్, ఎంపీపీ జాజాల భీమశ్వేరి కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే రైతు వేదికకు ప్రహరీ నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గోదూర్‌లో వైకుంఠధామం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరగా, గ్రామ పంచాయతీ నిధులతో మరో వైకుంఠధామం నిర్మించుకోవాలని సూచించిన ఆయన, తక్షణమే అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకోవాలని ఇన్చార్జి ఎంపీడీవో కృపాకర్‌కు సూచించారు.
తాజావార్తలు
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య
- మీరు ఎదిగి పదిమందికి సాయపడాలి : ఎమ్మెల్సీ కవిత
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అదేమిటంటే..
- చచ్చిపోయిన హీరోను మళ్లీ బతికిస్తారా