శనివారం 06 మార్చి 2021
Jagityal - Jan 22, 2021 , 01:23:34

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి

జగిత్యాల రూరల్‌, జనవరి 21: అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని లింగంపేట కుమ్మరి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సిరికొండ శ్రీనివాస్‌ ఎమ్మెల్యేను గురువారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అతడిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సిరికొండ లక్ష్మణ్‌, నరేశ్‌, సిరికొండ రాజయ్య, శంకర్‌, ధర్మయ్య, రాజయ్య, నర్సయ్య, లచ్చం, రవి తదితరులు పాల్గొన్నారు. 

ఈత వనం ప్రారంభం

జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామంలోని ఈత వనాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌ గురువారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ బోనాల జాతరలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోనగిరి నారాయణ, ఉప సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ భూపెల్లి శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ అధికారులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo