స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు

- మంత్రి కొప్పుల ఈశ్వర్
- ధర్మపురి మండలంలో పర్యటన
- అభివృద్ధ్ది పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
ధర్మపురి/ధర్మపురి రూరల్, జనవరి 20: సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు స్వరాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. ధర్మపురి మండలంలోని ధర్మపురి, బూరుగుపల్లి, తుమ్మెనాల, ఆరెపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. 11లక్షలతో చేపట్టిన బూరుగుపల్లి శివారులోని బోలిచెరువు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మరమ్మతు పనులు, తుమ్మెనాలలో 82.82 లక్షలతో 11 సీసీ రహదారులు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఆరెపల్లిలో గ్రామం నుంచి కొల్వాయి మీదుగా జగిత్యాల వరకు ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించారు. 60 లక్షలతో సీసీ రహదారులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ధర్మపురిలో గ్రంథాలయ భవనం మరమ్మతు, ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆఖరి ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయమని చెప్పారు. రైతుల కోరిక మేరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అనంతరం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు 62. 57లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్, ఎంపీడీఓ నరేశ్, ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్, నాయకులు భారతపు గుండయ్య ఉన్నారు.
తాజావార్తలు
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి
- ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..
- గులాబీమయమైన దొంగలమర్రి..
- ప్రభాస్ రికార్డు..సినిమాకు 100 కోట్ల పారితోషికం..!
- ఈ లిఫ్టుల ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు : మంత్రి హరీశ్