సమీకృత భవనాన్ని పరిశీలించినన కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్, జనవరి 19 : సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం భవన చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గగులోత్ రవి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్, వాటర్ కనెక్షన్లను తనిఖీ చేసి లీకేజీ, షార్ట్ సర్క్యూట్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపేలా లేఅవుట్ చేయాలన్నారు. ఆవరణలో మొక్కలు పెంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ బేతి రాజేశం, కాంట్రాక్టర్ యాదగిరిరావు, అధికారులు పాల్గొన్నారు.
పంటల నమోదు పకడ్బందీగా చేపట్టాలి
యాసంగి పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రవి వ్యవసాయాధికారులను ఆదేశించారు. యాసంగి పంటల నమోదుపై జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021లో పండిన ప్రతి పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పంటల వివరాల నమోదుపై జిల్లా వ్యవసాయాధికారి సురేశ్ అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్, ధర్మపురి ఏడీఏ రాంచందర్, వ్యవసాయాధికారులు, ఏఈవోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేడు తాకట్టు ఆస్తులు వేలం: ఎస్బీఐ
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్‌కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు