మంగళవారం 02 మార్చి 2021
Jagityal - Jan 20, 2021 , 01:11:59

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

అభివృద్ధి పనులకు భూమిపూజ

జగిత్యాల రూరల్‌, జనవరి 19 : పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం కన్నాపూర్‌లో పల్లె ప్రకృతి వనం, డంప్‌ యార్డ్‌, వైకుంఠధామాలను మంగళవారం వారు ప్రారంభించారు. అనంతరం డీఎంఎఫ్‌టీ నిధులు రూ. 4.60లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం, డంప్‌ యార్డ్‌, ప్రకృతి వనం, వైకంఠధామాలు, నర్సరీలు, ట్రాక్టర్లు, ట్యాంకర్ల ఏర్పాటుతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయన్నారు.ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, సర్పంచులు సుధాకర్‌, శేఖర్‌, తిరుపతి, దామోదర్‌, ఎంపీటీసీ రత్న, టీఆర్‌ఎస్‌ మండలాద్యక్షుడు బాల ముకుందం, రైతు బంధు సమితి కన్వీనర్‌ నక్కల రవీందర్‌రెడ్డి, నాయకులు గంగం మహేశ్‌, మీస వేణు తదితరులు పాల్గొన్నారు. 

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాలలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం అవుతున్నందున విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి హాజరు శాతం  పెంచాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తదితరులు ఉన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జగిత్యాల కలెక్టరేట్‌/అర్బన్‌ జనవరి 19 : జగిత్యాల  13, 31వ వార్డుల్లో రూ. 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి  ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భూమి పూజ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ మారుతీప్రసాద్‌, డీఈ లచ్చిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌,కౌన్సిలర్లు ఆసియాసుల్తానా, సాహెరాభాను, అల్లె గంగాసాగర్‌, బొడ్ల జగదీశ్‌, కోఆప్షన్‌ సభ్యుడు రియాజొద్దీన్‌, నాయకులు శేఖర్‌, మోయిన్‌, రిజ్వాన్‌, మొగలి, ముకీమ్‌, అహ్మద్‌, ఆసిఫొద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మోసిన్‌ పాల్గొన్నారు.  


VIDEOS

logo