సోమవారం 08 మార్చి 2021
Jagityal - Jan 19, 2021 , 00:36:36

మత్తడి ఎత్తును పెంచి సాగునీరందిస్తాం

మత్తడి ఎత్తును పెంచి సాగునీరందిస్తాం

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

కొడిమ్యాల, జనవరి 18: పోతారం రిజర్వాయర్‌ మత్తడి ఎత్తును పెంచి ఏడు గ్రామాలకు సాగు నీరు అందిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ మేనేని స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పోతారం రిజర్వాయర్‌ మ త్తడి ఎత్తు పెంచి శనివారంపేట, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, పూడూరు, చింతలపల్లి, గౌరాపురం గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని వివరించారు. తాను మండలానికి రూ.10 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులను కేటాయించానని, సంబంధిత పనులను వెంటనే పూర్తి చేయాలని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు సూచించారు. లేకపోతే ఆ నిధులను వేరే మండలానికి కేటాయిస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో మిషన్‌ భగిరథ పనులు వందశాతం పూర్తయినప్పటికీ అధికారుల ప్రణాళికా లోపం తో నల్లాల ద్వారా నీళ్లు రావడం లేదని పూడూర్‌ ఎంపీటీసీ అనుమాండ్ల రాఘవరెడ్డి, హిమ్మత్‌రావుపేట సర్పంచ్‌ పునుగోటి కృష్ణారావు పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన పూడూర్‌లో పర్యటిస్తానని  చెప్పారు. కోనాపూర్‌లో త్వరలో సబ్‌స్టేషన్‌ మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.  సమావేశంలో మల్యాల మర్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జనగాం శ్రీనివాస్‌, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సమ్మయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులున్నారు. 


VIDEOS

logo