జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం

రాయికల్ రూరల్, జనవరి 18: రాయికల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ టీకాను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని నియంత్రించడంలో వైద్యులు అలుపెరుగకుండా పోరాడుతున్నారని, వారి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. కొవిడ్ టీకా సురక్షితమైందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హెల్త్ సెంటర్‌కు సీఎస్ఆర్ ఫండ్ ద్వారా రూ.2లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో దవాఖానకు కావాల్సిన సర్జికల్ వస్తువులను కొనుగోలు చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాం డ్లు, వైస్ చైర్పర్సన్ గండ్ర రమాదేవి, ఎంపీపీ లావుడ్యా సంధ్య-సురేందర్‌నాయక్, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, వల్లకొండ మహేశ్, కన్నాక మహేందర్, తురగ శ్రీధర్‌రెడ్డి, నాయకులు గన్నె రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, తలారి రాజేశ్, కొల్లూరి వేణు, పెండ్యాల వని త, శ్రీరాముల సత్యనారాయణ, పిప్పోజి మహేందర్ బాబు, జోగిన్‌పెల్లి తిరుపతి గౌడ్, ఎలిగేటి అనిల్, మోర రామ్మూర్తి పాల్గొన్నారు.
కొడిమ్యాల, జనవరి 18: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆంగన్వాడీ కార్యకర్తలు 40 మందికి కరోనా వ్యా క్సిన్లు వేసినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. వ్యాక్సినేషన్‌ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. అంతకుముందు జిల్లా అబ్జర్వర్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి ప్రతాప్‌సింగ్, ఎంపీడీవో రమేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సర్పంచులున్నారు.
ధర్మపురి, జనవరి 18: సీహెచ్‌సీలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ధర్మపురి సీహెచ్‌సీ పరిధిలో వ్యాక్సినేషన్ కోసం 50 మంది కొవిన్ యాప్‌లో టీకా కోసం రిజిస్టర్ చేయించుకోగా 41 మంది టీకా వేయించుకున్నట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో 40 మంది వైద్య, ఒకరు ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు. మొదట వైద్యులు నరేశ్, సాయిసుధ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేశ్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
కోరుట్ల, జనవరి 18: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 49 మందికి టీకా వేసినట్లు అల్లమయ్య గుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సమీనా తెలిపారు. మొత్తం 50 మందికి టీకా ఇవ్వాల్సి ఉండగా ఒకరికి అనారోగ్య కారణంతో టీకా అందించలేదన్నారు. కాగా కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలకుడు, రాష్ట్ర టీబీ అధికారి ఆడెపు రాజేశం, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారి వాసుప్రసాద్, జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సమీయొద్దీన్ పరిశీలించారు. ఇక్కడ ఆరోగ్య విస్తరణాధికారి లింగ రాంమోహన్, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రేమలత, వైద్య సిబ్బంది ఉన్నారు.
కోరుట్ల రూరల్, జనవరి 18: అయిలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ తోట శ్రీనివాస్, జడ్పీటీసీ దారిశెట్లి లావణ్య, ఆర్టీవో వినోద్‌కుమార్ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50మందికి గానూ 47 మందికి టీకాలు వేశారు. కాగా వ్యాక్సిన్ కేంద్రాల రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అడెపు రాజేశంతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, జిల్లా ప్రోగ్రాం అధికారి సమీయొద్దీన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చీటి స్వరూప, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు పిడుగు రాధ, వైద్యాధికారిణి సునీత, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో నీరజ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 18: పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ జాజాల భీమేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా 46 మంది వైద్య సిబ్బందికి టీకా వేసినట్లు వైద్యాధికారి వనజ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సుందర వరదరాజన్, జడ్పీటీసీ భారతి, సర్పంచ్ నేమూరి లత, ఎంపీటీసీలు రాములు, రాజిరెడ్డి, ఏడీఈ మనోహర్, ఎస్ఐ వెంకట్రావు, డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ అధికారి శ్రీపతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హై ఫిల్టర్ మాస్క్‌లో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి