మంగళవారం 02 మార్చి 2021
Jagityal - Jan 17, 2021 , 03:38:00

యువ పురస్కార్‌ అవార్డుల ప్రదానం

యువ పురస్కార్‌ అవార్డుల ప్రదానం

రాయికల్‌ రూరల్‌, 16 : స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ రంగాలల్లో విశేష సేవలందించిన యువజన సంఘాలకు రాష్ట్ర స్థాయి యువ పురస్కార్‌ అవార్డులు వచ్చాయి. భూపతిపూర్‌ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, మైతాపూర్‌ నాగిరెడ్డి రఘపతిరెడ్డి, ఆలూరు మెక్కొండ రాంరెడ్డి, లింగాపూర్‌ గంగాధర్‌, రాయికల్‌ బూర్గుల రాజేందర్‌, కట్కాపూర్‌ మాదం మల్లేశ్‌ కోరుట్లలోఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యసాగర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 

మేడిపల్లి, జనవరి 16 : వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌, జీర్డ్స్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అంగడి ఆనంద్‌కుమార్‌, కొండాపూర్‌ సర్పంచ్‌ ద్యావనపెల్లి అభిలాష్‌, తొంబర్‌రావుపేటకు చెందిన నల్ల మహిపాల్‌రెడ్డికి  రాష్ట్ర యువ పురస్కార్‌ 2021 అవార్డులను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ప్రదానం చేశారు. శనివారం జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు అవార్డు గ్రహీతలను శాలువాలతో సన్మానించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, దుంపేట లక్ష్మీనర్సయ్య, గాజోజి చారి, ఎంపీటీసీలు చెన్నమనేని రవీందర్‌రావు, మకిలి దాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్‌, నాయకులు సుధవేని గంగాధర్‌, నెల్లుట్ల ప్రభాకర్‌, కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, నాంచారి రాజేందర్‌, బాలుసాని మారుతి, చెక్కపెల్లి రఘు, లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కొడిమ్యాల: నల్లగొండకు చెందిన అంతర్జాతీయ ఒగ్గు కథా కళాకారుడు బొల్లి రాజుయాదవ్‌ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత చేతుల మీదుగా యువ పురస్కార్‌ అవార్డును శనివారం అందుకున్నారు. కోరుట్లలో యువజన సంఘాల సమితి వారు కళారంగలో ప్రతిభ కనబర్చిన రాజుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. 


VIDEOS

తాజావార్తలు


logo